Chevireddy Bhaskar Reddy: నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే నేనే నేరుగా సిట్ ఆఫీసుకు వస్తా.. వాళ్లను వేధించొద్దు..!
- లిక్కర్ కేసులో నన్ను ఇరికించేందుకు కుట్ర..
- నన్ను అరెస్టు చేయడానికి సిట్ అధికారులు తపన పడుతున్నారు..
- నన్ను ఇబ్బంది పెట్టాలని సంతోష పడాలని అనుకుంటున్నారు..
- నన్ను అరెస్టు చేయాలని అనుకుంటే నేనే నేరుగా సిట్ ఆఫీస్ కు వస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chevireddy Bhaskar Reddy: లిక్కర్ కేసులో నన్ను అరెస్టు చేయడానికి సిట్ అధికారులు ఎంతగానో తపన పడుతున్నారు… ఇలా పోలీసులు చేయడం చాలా బాధాకరం.. లిక్కర్ కేసులో సంబంధం లేని నన్ను ఇబ్బంది పెట్టాలని సంతోష పడాలని అనుకుంటున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. గిరి, బాలాజీ సహా మరికొద్ది మందిని తీసుకెళ్లి నరకం చూపిస్తూన్నారట.. కాళ్లు, చేతులో కట్టేసి ఒక రహస్య ప్రదేశంలో పెట్టి వేధించి చెవిరెడ్డి పేరు చెప్పించాలని చూస్తున్నారని విమర్శించారు. అయితే, మీరు నన్ను అరెస్టు చేయాలని అనుకుంటే నేనే నేరుగా సిట్ ఆఫీస్ కు వస్తానని ఛాలెంజ్ చేశారు.. లిక్కర్ కేసులో నా పేరు లేకపోయినా.. నన్ను ఇరికించడానికి పోలీసులు ఎంతో కష్టపడుతున్నారు… మీరు ఎంత ఇబ్బంది పెట్టినా నేను సిద్ధం అన్నారు చెవిరెడ్డి.
Read Also: Kaleshwaram Commission: మరోసారి కేసీఆర్, హరీష్ రావు భేటీ.. మరో నివేదిక సిద్దం!
Also Read
- Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ..
ప్లాన్ ప్రకారం లిక్కర్ కేసులో బెదిరించి మా పేర్లు బయటకు తీసుకుని రావాలని చూస్తున్నారు.. అమాయకపు వ్యక్తులను వేధించడం బాధాకరం అన్నారు చెవిరెడ్డి.. మాజీ అధికారి ఘట్టమనేని శ్రీనివాస్ అధ్వర్యంలోనే లిక్కర్ కేసు విచారణ సాగుతోంది… ఆయన స్ర్కీప్ట్ తోనే లిక్కర్ కేసులో నా పేరు బయటకు తెచ్చారు.. మమ్మల్ని జైలుకు పంపాలి అంటే పంపండి అని సూచించారు. అయితే, భవిష్యత్తులో వారు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు.. నాతో ఉన్న వారందరినీ తీసుకెళ్లి వేధించాలని చూస్తున్నారు.. సిట్ కార్యాలయంలో కాకుండా ఓ రహస్య ప్రదేశంకు తీసుకువెళ్లి పోలీసులు హింసిస్తున్నారు.. చెవిరెడ్డికి లిక్కర్ కేసులో సంబంధమున్నట్లు చెబితే తప్ప వదిలేది లేదని పోలీసులు భయపెడుతున్నారు.. తమ వారిని పోలీసులు అక్రమంగా తీసుకువెళ్లి చిత్ర హింసలకు గురించేస్తుండటంపై బాధిత కుటుంబీకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. పోలీసుల దుశ్చర్యలపై హైకోర్టులో హెబియస్ కార్పస్ వేయనున్నారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
తాజావార్తలు
-
Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
-
Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
-
Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
-
Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!