తిరుపతిలోని శిల్పారామం వేదికగా చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి జగన్ వెంట ఉండాల్సి రావడంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ప్రకటించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 2024 ఎమ్మెల్యే అభ్యర్థిగా జనం ముదుకు వచ్చే చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు చెవిరెడ్డి. కేరింతలు పెడుతూ కరతాళ ధ్వనులతో మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ తమ మద్దతు తెలియపరచారు పార్టీ నేతలు, కార్యకర్తలు.
ఆత్మీయ సమ్మేళనంలో చెవిరెడ్డి మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు జన్మనిస్తే.. చంద్రగిరి ప్రజలు రాజకీయ జీవితాన్ని ఇచ్చారు. నన్ను నమ్మి నాతో పాటు ప్రయాణించి ఈ స్థాయికి చేర్చిన పార్టీ నేతలు, కార్యకర్తలకు రుణపడి ఉన్నాను. చంద్రగిరి నుంచి రాష్ట్ర స్థాయి నాయకునిగా నాకు గుర్తింపు వచ్చిందంటే అదంతా మీరు పెట్టిన భిక్ష. నా కుటుంబం కంటే ఎక్కువగా ప్రేమించే చంద్రగిరి ప్రజలకు కొంత దూరంగా ముఖ్యమంత్రి జగనన్నకు దగ్గరగా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది.ముఖ్యమంత్రి జగనన్న సూచన మేరకు మోహిత్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను. మీ అందరి కళ్ల ముందు పెరిగిన నా బిడ్డ మోహిత్ ను మీ బిడ్డగా దగ్గరకు తీసుకుని ఆదరించండి.ఇప్పటికే గడపగడపలో మోహిత్ ను ప్రజలకు పరిచయం చేసినా ఇకపై మరింతగా జనం మధ్యకు తీసుకుని వెళ్లాలి.చిన్నతనం వల్ల తెలిసో తెలియక ఎవ్వరిమనస్సు అయినా నొప్పించి ఉంటే మోహిత్ ను పెద్ద మనస్సుతో క్షమించండి అని కోరారు చెవిరెడ్డి.
Read Also: Mussoorie Accident: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. 22 మందితో వెళ్తూ లోయలో పడిన బస్సు
మీలో ఒక్కడిగా నా కంటే ఎక్కువగా ఒదిగిపోయే గుణం కలిగిన నా బిడ్డను కళ్లలో పెట్టుకుని కాపాడుకుంటూ విజయం దిశగా అడుగులు వేయించండి. జగనన్న దగ్గరుంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా ప్రత్యేక నిధులు మంజూరైనా మొదటగా చంద్రగిరికి తీసుకుని వస్తాను. నేను ఎక్కడ ఉన్నా.. ఏ స్థాయిలో ఉన్నా.. కష్ట కాలంలో నా వెంట నడిచిన నాయకులు, ఆదరించిన ప్రజలను ఎప్పటికీ మరవను. శత్రువులకు కూడా చెడు చేయకుండా, ప్రతిపక్షాలు సైతం కాదలేని విధంగా అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించాం. ఇప్పటి వరకు రూ.430 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేయగా మరో రూ.90కోట్లతో కొత్త పనులు ప్రారంభమం అవుతున్నాయి.
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పల్లెల్లో రాజకీయ గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణం కల్పించిన ఘనత మనకు మాత్రమే దక్కుతుంది. ప్రతి ఒక్కరూ ఒక సైనికునిలా కష్టపడి ఎంపీపీగా ఉన్న మోహిత్ ను ఎమ్మెల్యే గా పంపించాలి.చంద్రగిరి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేశాను. ఇకపై మోహిత్ కూడా అలాగే ప్రజలకు మరింత దగ్గరగా ఉండి సేవ చేయడానికి సంసిద్దంగా ఉన్నాడు.మీ అందరి ఆదరాభిమానాలు మోహిత్ పై ఉండాలని మరొక్కసారి కోరుకుంటున్నా అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
మోహిత్ మాట్లాడుతూ.. మీ అందరి ముందు చాలా చిన్నవాడిని.. తెలియక తప్పు చేసి ఉంటే క్షమించండి.. మీ అందరిలో ఒక్కడిగా కలసి పెరిగాను.. 2014, 2019 ఎన్నికల్లో మీ చేయి పట్టుకుని ప్రతి ఇల్లు తిరిగాను.జగనన్న దగ్గర ఉండాల్సి రావడంతో నాన్న వెళ్లాల్సి ఉంది. అందుకే ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించారు.మీ అందరి ఆశీస్సులు, జగనన్న ఆశయాలతో జనం ముందుకు వస్తున్నాను. పాదయాత్రలో మీరు చూపించే కృతజ్ఞత వెలకట్టలేనిది.నాన్న బాటలో నడిచే నాకు మీ అందరితో పరిచయాలు ఉన్నాయి. నన్ను మీ బీడ్డగా ఆశీర్వదించి ఆదరించాలని కోరుతున్నా అన్నారు.
Read Also: Icecream : సీలింగ్ ఫ్యాన్‌తో ఐస్‌క్రీం తయారీ.. మహిళను మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా