MP Ranjith Reddy: చేవెళ్లలో ప్రతి ఇంటికి ఆరు గ్యారంటీలు తెస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Ranjith Reddy: చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఆరు గ్యారంటీలకు అప్లయ్ చేసిన ప్రతి అర్హుడికి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు తీసుకువచ్చేందుకు తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందేదాకా తాను నిద్రపోనని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం తుక్కుగూడ కాంగ్రెస్ జనజాతర భారీ బహిరంగ సభలో ఎంపీ రంజిత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ… బ్రిటిషోడు ఈ దేశాన్ని మొత్తం ఊడ్సుకపొయిన తర్వాత… పేదోల్లకు పట్టెడన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని… గాంధీ, నెహ్రూ కుటుంబమే అని చెప్పారు. సంక్షోభం నుంచి సంక్షేమం కాంగ్రెస్‌తోనే దేశానికి దశా-దిశ దొరికిందని అన్నారు. తమ చేవెళ్ళ వైవిధ్యభరితమైందని చెప్పారు. ఎందుకంటే, తమ పార్లమెంట్ ప్రాంతం… హైదరాబాద్ నగరానికి కూరగాయలు, పూవ్వుల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా ఎగుమతి చేస్తందని చెప్పారు. హైదరాబాద్ మహానగర వంటింట్ల కూరగాయలు, కూరలు మనయేనని… దేవునింట్ల పూవ్వులు మనవేనని… కంప్యూటర్లలో సాఫ్ట్‌వేర్ కూడా మనవేనని నొక్కి చెప్పారు.
Read Also: Rahul Gandhi: బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోంది.. జనజాతర సభలో రాహుల్
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
తాను ఎంత అదృష్టవంతున్ని అయితే ఈ ఇంత గొప్ప నియోజకవర్గానికి ఎంపీని అవుతానని గుర్తు చేశారు. అయితే, ఈ అదృష్టం చేవెళ్ళ ప్రజలు ఇచ్చిన అవకాశమని… అదే అదృష్టం ప్రతి చేవెళ్ళ బిడ్డ కళ్ళల్ల చూసేదాకా తాను ప్రజాక్షేత్రంలో ఉంటానని వివరించారు. ఒక టీచర్ 60 ఏండ్లకు రిటైర్ అయితడని.. ఒక మిలిటరీ సిపాయి 40 ఏండ్లకు రిటైర్ అయితడని… కానీ తనకు మాత్రం రిటైర్మెంట్ తన చేవెళ్ళలో ప్రతి ఒక్కరి కల్లలో ఆనందం చూసేవరకు అంటూ భావోద్వేగానికి గురవుతూ రంజిత్ రెడ్డి మాట్లాడారు. ఇక చేవెళ్ళ ప్రజలకు అందుబాటులో లేని నాయకుడితో తనకు ఏమాత్రం పోటీ కాదని రంజిత్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థికి చురకులు అంటించారు. బీజేపీ హయాంలో కేవలం ఒకరిద్దరు పెట్టుబడిదారులు మాత్రమే లబ్ధి పొందినట్టు తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తాను అభివృద్ధి, అందుబాటు వంటి నినాదాలతో బరిలో నిలిచానని… ఈ సారి పంచసూత్రాలతో ప్రజల ముందుకు వస్తున్నట్టు వివరించారు. అవి అభివృద్ధి, అందుబాటు, విద్యా, వైద్యం, సంక్షేమం అని చెప్పుకొచ్చారు. సంపద సృష్టించి దాన్ని పేదలకు పంచడమే తన జెండా అని.. ఎజెండా అని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!