Cheteshwar Pujara: విదేశీ గడ్డపై సెంచరీ.. మళ్లీ జట్టులోకి వస్తానంటున్న సీనియర్ ప్లేయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ లో కౌంటీ క్రికెట్లో అతను రాయల్ లండన్ వన్డే కప్ లో ససెక్స్ తరుపున ఆడుతున్నాడు. 319 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగగా.. 113 బంతుల్లో 11 ఫోర్లతో 117 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు పుజారా.. దీంతో ససెక్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. ఈ టోర్నీలో పుజారాకు ఇదో రెండు సెంచరీ కావడం విశేషం. అయితే.. ఈ మ్యాచ్ తర్వాత పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఎక్కడాడిన వంద శాతం ఎఫర్ట్ పెడతాను. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తాను. టీమిండియా మరో మూడు నెలల పాటు టెస్టులు ఆడే అవకాశం లేదు. మళ్లీ డిసెంబర్లో సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఉంది. అప్పటి వరకు తిరిగి జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం అదే’ అని పుజారా తెలిపాడు.
Ankita Lokhande: సుశాంత్ మాజీ ప్రియురాలి ఇంట తీవ్ర విషాదం
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ఈసారి జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత టీమిండియాలో పూజారా కోల్పోయాడు. ఎందుకంటే పేలవ ప్రదర్శన చూపించడంతో.. అతన్ని వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌కు కూడా ఎంపిక చేయలేదు. దీంతో మళ్లీ టీమిండియాలోకి తిరిగి వచ్చేందుకు పుజారా కౌంటీలను వేదికగా ఎంచుకున్నాడు. గతంలోనూ ఓ సారి టీమిండియా నుంచి ఉద్వాసనకు గురైన సమయంలో ఇంగ్లండ్ కౌంటీల్లో అదరగొట్టి టీమిండియాలోకి పునారగమనం చేశాడు. అయితే మళ్లీ అదే దారిలోనే నడుస్తున్నాడు. మరోవైపు టీమిండియాలో యువ క్రికెటర్ల హవా పెరిగిపోవడంతో పుజారా, రహానే లాంటి సీనియర్లకు కాలం చెల్లిన పరిస్థితి కనిపిస్తోంది. పైగా వాళ్లు కూడా పెద్దగా రాణించడం లేదు. ఈ నేపథ్యంలో పుజారా కౌంటీల్లో అదురగొడుతూ.. మళ్లీ టీమ్‌లోకి రావడమే టార్గెట్‌గా పెట్టుకున్నానని టీమిండియా సెలెక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. మరి పుజారా తిరిగి టీమిండియాలోకి వస్తాడా అనేది వేచి చూడాలి.
Century by Cheteshwar Pujara!
His 2nd hundred in the Royal London One Day Cup – this came in 105 balls. Yet another terrific knock by Pujara! pic.twitter.com/4uyjYnKhl9
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 11, 2023
తాజావార్తలు
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..