NTV Telugu Site icon

Chennai: వైరల్ వీడియోలో పోలీసులను దుర్భాషలాడిన దంపతులు అరెస్టు..

Chennai

Chennai

తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు ఫోన్‌ చేస్తానని బెదిరిస్తూ నైట్‌ పెట్రోలింగ్‌ పోలీసులను దూషించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో చెన్నైకి చెందిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మెరీనా బీచ్‌లోని లూప్ రోడ్‌లో జరిగింది. అక్కడ రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు.. చంద్రమోహన్, ధనలక్ష్మి అనే దంపతులను ప్రశ్నించారు.

Read Also: No Romance in Cab: క్యాబ్‌లో రొమాన్స్ చేయకండి.. డ్రైవర్ వార్నింగ్

పోలీసులు వారిని విచారించగా తీవ్రంగా స్పందించారు. ఆశ్చర్యమేంటంటే.. దంపతులు పోలీసులపై దుర్భాషలాడారు. దీంతో.. పోలీసులు వారు తిడుతున్న ఘటనను వీడియో తీశారు. ఆ వీడియోలో, ఆ దంపతులు కెమెరాకు పోజులిచ్చి.. పోలీసులను కించపరిచే పేర్లతో బూతులు తిట్టారు. అంతేకాకుండా.. అసభ్య పదజాలంతో దూషించారు. ఒక పోలీసును “బల్లిలా కనిపిస్తున్నారు” అని కూడా దుయ్యబట్టారు. భర్త చంద్రమోహన్ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ వాదించాడు. “నేను ఉదయనిధి స్టాలిన్‌ని పిలవనా? నన్ను చూస్తే మీ స్టేషన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పారిపోతాడు.” మరుసటి రోజే మీ చిరునామాలను ట్రాక్ చేస్తానని బెదిరించాడు, తనను అరెస్టు చేయలేరని చెప్పాడు.

Read Also: Maharashtra: గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టు మృతి

వారు అక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు పదే పదే చెప్పినప్పటికీ.. చంద్రమోహన్ అధికారులను ఎగతాళి చేస్తూ.. తనను అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు లేదన్నాడు. కాగా.. ఈ దంపతులు చేసిన హంగామా.. అసభ్య పదజాలం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. కాగా.. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అగౌరవంగా ప్రవర్తించిన దంపతులపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వినియోగదారులు డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన అధికారులు.. ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి ఆ దంపతులను కనిపెట్టారు. చంద్రమోహన్, ధనలక్ష్మిలను వెలచ్చేరిలోని ఓ లాడ్జిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మైలాపూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు.