NTV Telugu Site icon

KKR vs CSK: స్వల్ప స్కోరు వద్దే కుప్పకూలిన చెన్నై.. కోల్‌కతా లక్ష్యం ఎంతంటే?

Csk Kkr

Csk Kkr

చెపాక్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన చెన్నై కుప్పకూలింది. 20 ఓవర్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ముందు 104 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. శివమ్‌ దూబే (31) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. విజయ్‌ శంకర్‌ (29) ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లందరూ గంపగుత్తగా చేతులెత్తేశారు. మరోవైపు.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 3, వరుణ్‌ చక్రవర్తి 2, హర్షిత్‌ రాణా 2, మొయిన్‌ అలీ 1, వైభవ్‌ అరోరా 1 వికెట్‌ తీసుకున్నారు.

READ MORE:Vontimitta Kodandarama Swamy: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల‌ క‌ల్యాణం

ఇదిలా ఉండగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ వారి జట్టుకు నాయకత్వం బాధ్యతను మరోమారు ఎంఎస్ ధోనికి కట్టబెట్టింది. రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన నేపథ్యంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని మళ్లీ కెప్టెన్‌గా నియమించినట్లు సీఎస్కే యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం సీఎస్కే కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ మోచేయి ఫ్రాక్చర్‌తో ఇబ్బందిపడుతున్నాడు. మొదట్లో చిన్న గాయం అనుకున్నా.. కానీ, పరీక్షల తర్వాత పూర్తిగా టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా రుతురాజ్ టాస్‌కు వచ్చి మైదానంలోకి అడుగుపెట్టినప్పటికీ, ఆడే సమయంలో అతడి గాయ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఈ మ్యాచ్‌లో టీం పగ్గాలు ధోనీ చేతులో ఉన్నాయి.

READ MORE: Krishna District: అలర్ట్.. 40 మందికి పైగా క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్..