నటి శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ‘చీకటిలో’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేష్ బాబు నిర్మించగా, శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. సినిమాలో విశ్వదేవ్ రాచకొండ, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని వంటి అనుభవజ్ఞులైన నటీనటులు కీలక పాత్రలు పోషించారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదల కాబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 23, 2026 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
Also Read : Samantha : సమంతకు దొరికిన నిజమైన హ్యాపీనెస్ ఇదేనా?
ఇప్పటికే ఫస్ట్ లుక్ అదిరిపోగా.. తాజాగా ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పెళ్లి తర్వాత శోభిత నుంచి వస్తున్న మొదటి తెలుగు ప్రాజెక్ట్ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ట్రైలర్‌ని కనుక పరిశీలిస్తే హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో శోభిత ‘సంధ్య’ అనే ట్రూ క్రైమ్ పోడ్‌కాస్టర్‌గా కనిపిస్తోంది. నగరంలో వరుసగా జరుగుతున్న హత్యలు, ఆ మిస్టరీ వెనుక ఉన్న ఒక సీరియల్ కిల్లర్ గురించిన నిజాలను ఆమె తన పోడ్‌కాస్ట్ ద్వారా ఎలా వెలికితీసింది అనే పాయింట్ ట్రైలర్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
