Kodak CA Pro 65-inch TV Price and Features: ‘కోడాక్’ ఇటీవలే సీఏ ప్రో 65 ఇంచెస్ గూగుల్ టీవీని ప్రారంభించింది. ఇందులో స్మార్ట్ టీవీలో ఉండాల్సినవన్నీ ఉన్నాయి. అద్భుత స్పీకర్ సెటప్ నుంచి 65 ఇంచెస్ 4K యూహెచ్‌డీ డిస్‌ప్లే వరకు ఇందులో ఉంటాయి. తాజా గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్, డాల్బీ అట్‌మోస్, డాల్బీ విజన్, క్రోమ్ కాస్ట్ మరియు మరిన్ని ఫీచర్స్ ఉంటాయి. ఈ టీవీ ధర కూడా రూ.45 వేల లోపే ఉంటుంది. ఈ టీవీలో ప్రత్యేకత ఏంటో, కొనాలా వద్దా అనే విషయాలు తెలుసుకుందాం.
కోడాక్ సీఏ ప్రో 65 ఇంచెస్ టీవీ పెద్ద స్క్రీన్ కలిగిన టీవీ. దీని వెనుక కేసింగ్ ప్లాస్టిక్ ఉంటుంది. ఈ టీవీని చాలా సన్నగా ఉండనుంది. కంపెనీ స్టైలిష్ డిజైన్‌ను అందించింది. ఇది ప్రీమియం రూపాన్ని ఇస్తుంది. అయితే వెనుక భాగం కాస్త మందంగా ఉంటుంది. గోడపై అమర్చితే ఎలాంటి తేడా ఉండదు. ఈ టీవీ డిస్‌ప్లే బెజెల్స్ చాలా సన్నగా ఉంటాయి. టీవీ స్టాండ్ కూడా మెటల్‌తో తయారు చేయబడి మంచి నాణ్యతతో ఉంటుంది. ఈ టీవీలో పోర్టులకు కూడా కొరత లేదు. ఇది మూడు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు, ఒక ఆప్టికల్ పోర్ట్, ఒక ఈథర్‌నెట్ పోర్ట్, బ్లూటూత్ మరియు eARC మద్దతుతో డ్యూయల్-బ్యాండ్ Wi-Fiతో వస్తుంది.
ఈ టీవీ ప్యానెల్ మంచి నాణ్యతతో ఉంటుంది. ప్యానెల్ డాల్బీ విజన్, HDR10+ MEMCకి మద్దతు ఇస్తుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. వినియోగదారులు తమకు అనుగుణంగా రంగు, కాంట్రాస్ట్ సెట్ చేసుకోవచ్చు. టీవీ ప్రదర్శన నాణ్యత అద్భుతంగా ఉంటుంది. బ్లాక్ సీన్‌లో కూడా మంచి బ్రైట్‌నెస్ ఉంటుంది. అంతేకాదు విజువల్స్ స్పష్టంగా కనిపిస్తాయి. అన్ని రకాల వీడియోలు బాగా ప్లే అవుతాయి. ఇందులో గూగుల్ అసిస్టెంట్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి యాప్‌లు ఇన్‌స్టాల్ చేయబడతాయి. ప్లే స్టోర్ నుంచి వినియోగదారు మరిన్ని యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కోడాక్ సీఏ ప్రో 65 ఇంచెస్ టీవీలో మీడియాటెక్ చిప్‌సెట్, 2GB RAM మరియు 16GB స్టోరేజ్ ఉంటాయి. దాంతో అప్లికేషన్లు త్వరగా లోడ్ అవుతాయి ఈ టీవీ డాల్బీ అట్‌మోస్‌కి మద్దతుతో 40W స్పీకర్లతో వస్తుంది. ఆడియో పెద్దగా మరియు స్పష్టంగా ఉంటుంది. ఈ టీవీకి చిన్న రిమోట్ వస్తుంది. ఇందులో పవర్, మ్యూట్, డి-ప్యాడ్, వాల్యూమ్ మరియు ఛానెల్ ఛేంజర్ అలాగే ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ మరియు మరిన్నింటి కోసం కీలు ఉంటాయి. ఈ రిమోట్ ద్వారా టీవీని సులభంగా ఆన్/ఆఫ్ చేయవచ్చు, సౌండ్‌ను మ్యూట్ చేయవచ్చు, ఛానెల్‌లు మరియు వాల్యూమ్‌ను మార్చవచ్చు. మీరు తక్కువ ధరలో పెద్ద స్క్రీన్‌తో కూడిన స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇది మంచి ఎంపిక.
Also Read: ODI Worldcup 2023: ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోవడం సిగ్గుచేటు: సెహ్వాగ్