AI కంపెనీ OpenAI తన కొత్త సబ్‌స్క్రిప్షన్ టైర్ “ChatGPT Go”ని భారత్ లో ఒక సంవత్సరం పాటు పరిమిత సమయం వరకు ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. నవంబర్ 4న ప్రారంభమయ్యే ప్రమోషనల్ టైమ్ లో సైన్ అప్ చేసుకునే భారతీయ వినియోగదారులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ చొరవ OpenAI మొట్టమొదటి భారతీయ ఈవెంట్ “DevDay Exchange”తో సమానంగా ఉందని కంపెనీ చెబుతోంది.
Also Read:SamanthaRuthPrabhu : శారీలో ఫ్యాన్స్ ను గిలిగింతలు పెడుతున్న సమంత.. ఫొటోస్
OpenAI ఆగస్టులో ChatGPT Go సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది. తక్కువ ధరకు ChatGPT అధునాతన ఫీచర్‌లను యూజ్ చేయాలి అనే వారి డిమాండ్‌ను తీర్చడానికి ఈ ప్లాన్ ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ప్లాన్ వినియోగదారులకు ఎక్కువ ప్రశ్నలు, ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్‌లోడింగ్ వంటి ఫీచర్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. ChatGPT Go ప్రారంభించిన వెంటనే భారీ విజయాన్ని సాధించిందని, ప్రారంభించిన మొదటి నెలలోనే భారతదేశంలో సబ్‌స్క్రైబర్ల సంఖ్య రెట్టింపు అయిందని OpenAI తెలిపింది.
Also Read:Cyclone Montha: మొంథా తుఫాన్.. క్షేత్రస్థాయి పరిస్థితులపై మంత్రి లోకేష్ ఆరా..
ఈ బలమైన డిమాండ్ కారణంగా, కంపెనీ ఇప్పుడు దాదాపు 90 దేశాలలో ఈ సేవను ప్రారంభించింది. నేడు, భారతదేశంలో మిలియన్ల మంది వినియోగదారులు ప్రతిరోజూ ChatGPTని ఉపయోగిస్తున్నారు, వీరిలో డెవలపర్లు, విద్యార్థులు మాత్రమే కాకుండా నిపుణులు కూడా ఉన్నారు. ఇప్పటికే ఉన్న ChatGPT Go సబ్‌స్క్రైబర్లు కూడా ఈ 12 నెలల ఉచిత ఆఫర్‌కు అర్హులు అవుతారని OpenAI తెలిపింది.