NTV Telugu Site icon

ChatGPT : మోదీ, మస్క్‎ల గురించి సంచలన విషయాలు చెప్పిన చాట్ జీపీటీ

Chat Gpt

Chat Gpt

ChatGPT : చాట్ జీపీటీ ఇప్పుడు ఈ పేరు హాట్ టాపిక్.. ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఏలుతున్న గూగుల్ తల్లికే గుబులు పుట్టిస్తున్న పిల్ల బ్రౌజర్. దీని రాకే ఓ సంచలనం. వచ్చీ రావడంతోనే అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ టూల్ వాడేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారంటే అది అందజేస్తున్న సౌకర్యాలు అలాంటివి మరి. మనకు తెలియని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చాట్ జీపీటీ వివరంగా అందజేస్తుంది. ఈ క్రమంలోనే ఐజాక్‌ లాటెరెల్‌ అనే వ్యక్తి ఎలాన్‌ మస్క్‌ గురించి చాట్‌ జీపీటీని ప్రశ్నించాడు. ఐజాక్ ఒక్క ఎలాన్ మస్క్ గురించే కాదు అతడితో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, రష్యా అధ్యక్షుడు వాల్దిమిర్‌ పుతిన్, కిమ్ కర్దాషియన్ లాంటి వ్యక్తులు గురించి అడిగారు.

Read Also: Kerala Government: ప్రభుత్వ ఉద్యోగులకు ఆ ఛానళ్లు ఉండొద్దు

వీళ్ళందరూ వివాదాస్పద వ్యక్తులుగా చాట్ జీపీటీ పేర్కొంది. అంతే కాదు వీరిని ప్రత్యేకంగా పరిగణించాలని కూడా చెప్పింది. వీళ్లే కాదు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తదితరులను వివాదాస్పద వ్యక్తులుగా పరిగణించింది. న్యూజిలాండ్‌ మాజీ ప్రధాని జెసిందా ఆర్డెమ్‌, బిల్‌గేట్స్ , జర్మన్‌ మాజీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కల్‌ తదితరులను నాన్‌-కాంట్రవర్షియల్‌ వ్యక్తులుగా పేర్కొంది. ఇందుకు సంబంధించిన లిస్ట్‌ను ఐజాక్‌ లాటెరెల్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు.

Show comments