Family Suicide: హైదరాబాద్ నగరంలో పెను విషాదం చోటు చేసుకుంది. నగర శివారులోని చర్లపల్లి- ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంఎటీఎస్ డౌన్ లైన్‌లో ఈరోజు తెల్లవారుజామున హృదయవిదారక ఘటన నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు బోడుప్పల్ లోని హరితహారం కాలనీకి చెందిన పిన్నింటి విజయశాంతి రెడ్డి, ఆమె కూతురు చేతన (చైతన్య) రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డిగా గుర్తించారు. విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
Read Also: Debt Burden on Indian States: అప్పుల ఊబిలో రాష్ట్రాలు.. ఏపీ సహా టాప్ 10 స్టేట్స్ ఇవే..
ఇక, మృతురాలు విజయశాంతి రెడ్డి కూతురు చేతన రెడ్డి ఇంటర్ రెండో సంవత్సరం, కుమారుడు విశాల్ రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే, మృతురాలు విజయశాంతి రెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగి నెలకు సుమారు లక్ష రూపాయలు జీతం వస్తుంది.. ఇక, ఆమె భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులోని సిరామిక్ కంపెనీలో పని చేస్తాడు. వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేనట్లు కాలనీ ప్రజలు పేర్కొంటున్నారు. ఇక, మృతురాలు భర్త ప్రస్తుతం నెల్లూరులో ఉన్నారు. ఇక, ముగ్గురు ఆత్మహత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
