భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో విజయం సాధించి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. కాగా.. ఈనెల 12న మూడో వన్డే మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి టీం ఇండియా ప్లేయింగ్-11పై ఉండనుంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన భారత జట్టు ఈ మ్యాచ్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధం కావడానికి చాలా ముఖ్యం. మొదటి రెండు మ్యాచ్‌లలో బెంచ్ మీద కూర్చున్న ఆటగాళ్లకు మూడో మ్యాచ్‌లో అవకాశం ఇచ్చి.. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ తమ బలాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కుతుంది.
Read Also: Infosys Layoffs: “సాఫ్ట్‌వేర్” ఆశలు ఆవిరి.. కన్నీటితో ఇళ్లకు వెళ్లిన ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్..
పంత్‌కు అవకాశం..?
మూడో మ్యాచ్‌లో పంత్‌కు అవకాశం లభిస్తుందా లేదా అని క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా.. అతని స్థానంలో ఆడుతున్న కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. రాహుల్ ఫామ్‌లో లేకపోవడం భారత్‌కు సమస్యగా మారింది. మూడవ మ్యాచ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేయింగ్-11లో ఏ వికెట్ కీపర్‌ను పరిగణించవచ్చో చూసే అవకాశం జట్టు యాజమాన్యం పంత్‌కు ఇవ్వవచ్చు. ఈ క్రమంలో.. పంత్ ఆడే అవకాశం ఉంది..
మహ్మద్ షమీకి విశ్రాంతి..
మహ్మద్ షమీకి కూడా విశ్రాంతి ఇచ్చి అతని స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం ఇవ్వవచ్చు. ఈ ఎడమచేతి వాటం బౌలర్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్నాడు. ఈ క్రమంలో అర్ష్‌దీప్ సింగ్‌కు కూడా ఒక అవకాశం ఇచ్చి పరీక్షించవచ్చు.
విజయ్, కుల్దీప్, కోహ్లీ పరిస్థితి ఏంటీ..?
వరుణ్ చక్రవర్తికి విశ్రాంతి ఇచ్చి కుల్దీప్ యాదవ్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావచ్చు. వరుణ్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో లేడు. అతని స్థానంలో కుల్దీప్ కు అవకాశం ఇచ్చి ఐసిసి టోర్నమెంట్‌కు సిద్ధం చేయచ్చు. మరోవైపు.. టీమిండియా వన్డే సిరీస్ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి శుభ్‌మాన్ గిల్‌కు కెప్టెన్ బాధ్యతలు అప్పజెప్పనున్నారు. మొదటి వన్డే ఆడిన తర్వాత రెండో వన్డేకు ఆడని యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి తీసుకోనున్నారు. మరోవైపు.. విరాట్ కోహ్లీ ఫామ్ ఇప్పటికీ ఆందోళన కలిగించే విషయమే కాబట్టి అతన్ని జట్టులో ఉంచనున్నారు. ఈ మ్యాచ్ కోహ్లీ తన ఫామ్‌లోకి తిరిగి రావడానికి, పెద్ద టోర్నమెంట్‌కు ముందు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని పొందడానికి ఒక అవకాశంగా ఉంటుంది. అలాగే.. శ్రేయాస్ అయ్యర్ కు కూడా అవకాశం ఇవ్వాలని జట్టు కోరుకుంటోంది.
టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్-11:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్)
యశస్వి జైస్వాల్
విరాట్ కోహ్లీ
శ్రేయాస్ అయ్యర్
రిషబ్ పంత్ (వికెట్ కీపర్)
హార్దిక్ పాండ్యా
రవీంద్ర జడేజా
అక్షర్ పటేల్
కుల్దీప్ యాదవ్
హర్షిత్ రాణా
అర్ష్‌దీప్ సింగ్.