Lyricist Chandrabose: కలల వెతుకులాట నుంచి ఆస్కార్ విజయం వరకు తెలుగు సినీ సాహితీ వనంలో తనదైన ముద్ర వేసిన రచయిత చంద్రబోస్. 1995లో ‘తాజ్ మహల్’ చిత్రంతో ప్రారంభమైన ఆయన ప్రస్థానం నేటికి 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ కాలంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులను, అవమానాలను ఎదుర్కొని నేడు ప్రపంచ వేదికపై తెలుగు పాట జెండాను ఎగురవేశారు. ఆయన ఇటీవల ‘NTV’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు.
READ ALSO: Lyricist Chandrabose : ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వస్తుందనుకోలేదు: చంద్రబోస్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1995లో ‘తాజ్ మహల్’ సినిమాతో పాటల రచయితగా పరిచయం అయినట్లు తెలిపారు. కెరీర్ ప్రారంభంలో సుమారు 21 ఏళ్ల వరకు ఎన్నో అవమానాలను భరించానని, ఆ తర్వాతే సన్మానాలు, బహుమానాలు రావడం మొదలైందని భావోద్వేగానికి గురయ్యారు. ఎక్కడికి వెళ్తామో, ఏం చేస్తామో తెలియని మొండి ధైర్యంతో పరిశ్రమలోకి అడుగుపెట్టి, నేడు 3600కు పైగా పాటలను రాసినట్లు తెలిపారు. దర్శకుడు సుకుమార్‌తో తనకున్న అనుబంధం గురించి చెబుతూ.. తమ కలయికలో వచ్చిన పాటలు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. ఒక పాట రాయడానికి కేవలం 45 నిమిషాలే పట్టినా, అది పూర్తిస్థాయిలో బయటకు రావడానికి కొన్నిసార్లు 19 నెలల సమయం కూడా పట్టిందని వివరించారు. అలాగే ‘సై సినిమాలో అవకాశం రాకపోయినా, రాజమౌళి గారు ఆ వడ్డీతో కలిపి ‘RRR’లో గొప్ప అవకాశం ఇచ్చారు’ అని చమత్కరించారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా తన జీవిత పాఠాలను, సాహిత్య ప్రయాణాన్ని పంచుకుంటూ, చలనచిత్ర పరిశ్రమలోకి రావాలని కలలు కనే ఎంతో మంది కొత్తవారికి స్ఫూర్తిని నింపారు చంద్రబోస్.
READ ALSO: Rishabh Pant: నేడే న్యూజిలాండ్‌తో వన్డేలకు టీమిండియా జట్టు ఎంపిక .. పంత్‌కు ఛాన్స్ ఉందా?