Nandyala: రేపు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చంద్రబాబు ‘ రా కదలిరా’ సభ నిర్వహించనున్నారు. అయితే ఈ సభకు ముందే నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ఈ సభకు.. ఏవి సుబ్బారెడ్డి రాకూడదని అల్టిమేటం జారీ చేశారు. ఆయన వస్తే రచ్చ రచ్చే అని అంటున్నారు. తాను సైలెంట్ గా ఉన్నా, అనుచరులు ఊరుకోరని భూమా అఖిల ప్రియ అంటున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, పరిశీలకుడు ప్రభాకర్ చౌదరి ముందు చెప్పింది అఖిల ప్రియ.
Read Also: Big Breaking: గీత దాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైసీపీ సీరియస్ యాక్షన్
కాగా.. సభకు వచ్చే విషయాన్ని ఆలోచించాలని, ఏదైనా సంఘటన జరిగితే ఎన్నికల సమయంలో పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని ఏవి సుబ్బారెడ్డికి టీడీపీ నేతలు సూచించారు. ఈ క్రమంలో.. రేపటి చంద్రబాబు సభకు వెళ్లకూడదని ఏవి సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. జనసేన నేతలు కూడా వేదికపై రాకూడదని అఖిల ఆంక్షలు విధించారని ప్రచారం జరుగుతోంది. రేపటి చంద్రబాబు సభ వేదికపైకి జనసేన నేతలు సందేహంలో ఉన్నారు.
Read Also: Uttar Pradesh: 5 ఏళ్ల క్రితం వ్యక్తి మృతి, కట్ చేస్తే.. రెండో భార్య, నలుగురు పిల్లలతో దొరికాడు..