Chandrababu: శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం..

  • శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించిన పవన్ కళ్యాణ్.. శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు..
Chandrabu

Chandrabu

NDA Legislative Party: విజయవాడలో ఎన్డీయే శాసనసభాపక్ష సైతం జరిగింది. ఇందులో శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు కూటమి ఎమ్మెల్యేలు పంపనున్నారు. కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరితో పాటు కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.

Read Also: Ram Pothineni : ఆ యంగ్ డైరెక్టర్ తో మూవీ ప్లాన్ చేస్తున్న రామ్..?

×
×
Ad

అలాగే, తెలుగుదేశం పార్టీ టీడీపీ శాసనసభా పక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడిని పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రబాబు నాయుడి పేరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. దీనికి పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా మద్దతు పలికారు.