NTV Telugu Site icon

Chandrababu: ఆట మొదలైంది.. ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరు..

Chandrababu

Chandrababu

Chandrababu: నగరిలో మీ ఉత్సాహం చూస్తూ ఉంటే రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని అనిపిస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సభలో గాలి భానుప్రకాష్, ఇతర నేతలు పాల్గొన్నారు. నగరి మీటింగ్‌ చూసిన తర్వాత జగన్ మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. డగ్స్, గంజాయి, హింస రాజకీయాలు, భూ కబ్జాలకు వైసీపీ అడ్డాగా మారిందని విమర్శలు గుప్పించారు. అప్పుడు ముద్దులు పెట్టాడు.. ఇప్పుడు పిడి గుద్దులే పిడి గుద్దులు.. బాదుడే బాదుడు అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ అవినితి డబ్బులతో ఇచ్చి బోగస్ సర్వేలు వదులుతాడు.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తాడని ఆయన విమర్శించారు. జగన్ పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేశాడని ఆరోపించారు.

Read Also: Pawan Kalyan: పవన్‌ను కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి

తన మిత్రుడు గాలిముద్దుకృష్ణమ నాయుడు చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయన్నారు. ముద్దు కృష్ణమ పేదల కోసమే పుట్టాడన్నారు. ఈ సభలో చంద్రబాబు హామీల వర్షం కురిపించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. “చేనేత కార్మికులకు ఐదువందల యూనిట్లు ఫ్రీగా ఇస్తాను. వేణుగోపాల్ సాగర్, గాలేరు నగరి ప్రాజెక్టులు పూర్తి చేస్తాను. అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే మెగా డీఎస్సీ వేస్తాను. ఒకటో తేదీనే నాలుగు వేల పింఛన్ మీ ఇంటికే పంపిస్తాను. అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు పెంచం.. నాణ్యమైన కరెంట్ ఇస్తాను. నాణ్యమైన మద్యం తక్కువ ధరలకే ఇస్తాం. తిరుమలలో అన్నదానం క్యాంటీన్‌ను సరిగా చూడలేకపోతున్నారు. మళ్ళీ అన్నా క్యాంటీన్‌లను ప్రారంభిస్తాం.. నిరుపేదలకు ఆహారం అందిస్తాం.” అని హామీల వర్షం కురిపించారు.

Read Also: CM Jagan Election Compaign: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం

ఆట మొదలైంది.. ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరని చంద్రబాబు అన్నారు. నగరి ప్రజల స్పందనతో ఈరోజు హాయిగా నిద్రపోతానన్నారు. రాష్ట్రానికి మంచి రోజుకు వస్తుందనే ఒక నమ్మకాన్ని నగరి ప్రజలు ఇచ్చారన్నారు. ఏపీలో ఇక ఏకపక్ష ఎన్నికలే అని చంద్రబాబు పేర్కొన్నారు. నగరిలో గాలి భాను ప్రకాష్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ముద్దుకృష్ణమనాయుడు తలపించే విధంగా భాను ప్రకాష్ ప్రజా సేవ చేస్తాడన్నారు. అలా ప్రజాసేవ చేయించే బాధ్యత తనదని చంద్రబాబు హామీ ఇచ్చారు. మంచి నాయకుడుగా భాను పనిచేస్తాడు.. భానుకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. ప్రధాన మంత్రి పర్యటనలో ఆయన మైక్ నే కట్ చేశారు.. మళ్ళీ తన మీదే విమర్శలు చేశారన్నారు.

జబర్దస్తీ ఎమ్మెల్యే ఉంది.. ఆమెకు దోచుకోవడమే పని అంటూ ఆయన ఆరోపించారు. భువనేశ్వరి అనే మహిళ నుండి మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇస్తామని నలభై లక్షల రూపాయలు లంచం తీసుకున్నారని ఆరోపణలు చేశారు. నగరిలో ఇసుక, గ్రావెల్ దౌర్జన్యం, భూ దందాలతో రోజా కుటుంబం అడ్డదిడ్డంగా దోచుకుందని విమర్శించారు. రోజా, భూమన కరుణాకర్ రెడ్డి కలసి పాదిరేడు అరణ్య భూములు దోచుకున్నారని ఆయన పేర్కొన్నారు. నగరి నియోజక వర్గంలోని చక్కెర ఫ్యాక్టరీనీ మళ్ళీ తెరిపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.