టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబు 53 రోజుల పాటు జైలులో ఉన్నారు. ఆయనకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన్ని జైలు అధికారులు రిలీజ్ చేశారు. దీంతో చంద్రబాబు తమ అధినేత రిలీజ్ కావడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తులు, నాయకులు రాజమండ్రి జైలు దగ్గరకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలికారు. దీంతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం దగ్గర కోలాహల వాతావరణం కొనసాగింది.
Read Also: Actor Pradeep: తెలుగు సీరియళ్ళ మీద పీహెచ్డీ సంపాదించిన ప్రదీప్ భార్య
ఇక, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ, ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కంభంపాటి రామ్మోహన్‌రావు, ఏలూరి సాంబశివరావు, టి.డి.జనార్దన్ తదితరులు జైలు దగ్గరకు చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఇక, 53 రోజులుగా జైలులో ఉన్న చంద్రబాబును చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు తరలివచ్చారు. అయితే, చంద్రబాబు నాయుడు ఎనర్జీ బలగాలు కాన్వాయ్ తో బయటికి వచ్చారు. చంద్రబాబు తన సొంత వాహనంతో విజయవాడకు బయలుదేరి వెళుతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు మెయిన్ గేటు దగ్గర చంద్రబాబుకు తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నిజం గెలిచిందంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు.