Site icon NTV Telugu

AP Politics: బీజేపీతో పొత్తుపై చర్చలు.. ఢిల్లీకి మొదట చంద్రబాబు, తర్వాత పవన్‌..!

Ap Politics

Ap Politics

AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పార్లమెంట్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. దీంతో, పొత్తులపై ఆయా పార్టీలు చర్చలు ముమ్మరం చేస్తున్నాయి.. ఏపీలో ఇప్పటికే బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉందని.. రెండు పార్టీల నేతలు చెబుతున్నారు.. మరోవైపు.. టీడీపీ-జనసేన మధ్య కూడా పొత్తు కుదిరింది.. కానీ, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి నడుస్తాయా అనేది తేలాల్సి ఉండగా.. త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తులపై చంద్రబాబుతో మంతనాలు జరపనున్నారు బీజేపీ ఢిల్లీ పెద్దలు. ఈ నెల 8వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందంటున్నారు.. ఎనిమిదో తేదీన భేటీ కావాలని చంద్రబాబు – పవన్ కల్యాణ్‌ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.. ఇక, చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కల్యాణ్‌ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు.. మొత్తంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీతో పొత్తులపై క్లారిటీ వస్తుందని నేతలు చెబుతున్నారు. 8వ తేదీన చంద్రబాబు హస్తినకు వెళ్తి చర్చలు జరిపితే.. 10వ తేదీన పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. ఇక, టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుల వ్యవహారంలో జరగుతోన్న చర్చపై పూర్తి సమాచారం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..

Exit mobile version