Site icon NTV Telugu

CM Chandrababu Naidu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి ఐదు సంతకాలు వీటిపైనే..

Cm Babu

Cm Babu

CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు నారా చంద్రబాబు నాయుడు.. తన నివాసం నుంచి సచివాలయం వరకు చంద్రబాబుకు స్వాగతం లభించింది.. టీడీపీ శ్రేణులు, కూటమి నేతలు, అభిమానులు, అమరావతి రైతులు.. ఇలా దారి పొడవునా భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. ఇక, చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ.. కొన్ని చోట్ల పూల వర్షం కురిపించారు అమరావతి రైతులు.. రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు ఉన్న శిబిరాలను వారే తొలగించుకున్నారు.. ఇక, సచివాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు, సచివాలయ ఉద్యోగులు స్వాగతం పలికారు.. తన చాంబర్‌కు చేరుకున్న చంద్రబాబు.. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు..

Read Also: New York: నసావు కౌంటీ స్టేడియంను కూల్చివేయడానికి వచ్చిన బుల్డోజర్లు.. ఎందుకో తెలుసా..?

ఆ తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పనిలో మునిగిపోయారు.. సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే.. వరుసగా ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు చంద్రబాబు నాయుడు.. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్‌పై మొదటి సంతకం చేసిన చంద్రబాబు.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేస్తూ రెండో ఫైల్‌పై సతకం చేశారు.. ఇక, పెన్షన్లు రూ.4వేలకు పెంచుతూ మూడో ఫైల్‌పై సంతకం చేశారు.. అన్న క్యాంటీన్ల ఏర్పాటు కోసం 4వ సంతకం పెట్టారు.. నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు..

Exit mobile version