Site icon NTV Telugu

Chandrababu: ‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను’.. నాలుగో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం

Chandrababu

Chandrababu

Chandrababu: ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించారు.

Read Also: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణం.. దద్దరిల్లిన వేదిక

ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్యం-ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా, కేంద్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి జీతన్ రామ్ మాంఝీ, కేంద్ర ఆహార ఉత్పత్తుల శాఖా మంత్రి చిరాగ్ పాశ్వాన్, కేంద్ర రోడ్ల రవాణా-ప్రధాన రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వీ.రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, మధ్యప్రదేష్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర స్కిల్ డెవలెప్మెంట్ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సహాయ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖా మంత్రి అనుప్రియా పటేల్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సహాయశాఖా మంత్రి రామ్ దాస్ అథవాలే,రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేల్, మాజీ గవర్నర్ తమిళిసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం పాల్గొననున్నారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Exit mobile version