NTV Telugu Site icon

CM Chandrababu: రాష్ట్రంపై రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉంది..

Cm Chandrababu

Cm Chandrababu

చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. దీనిలో భాగంగా కల్లు గీత కార్మికునికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం పెన్షన్లను రూ. 3 వేలు చేసింది.. మేము వచ్చి రాగానే పింఛన్లను రూ. 4 వేలకు పెంచామని సీఎం అన్నారు.

Also Read:Champions Trophy 2025: సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు షాక్..

గడిచిన ఐదేళ్లు ప్రజలు అనేక బాధలు పడ్డారు.. మా ప్రభుత్వం అప్పు కోసం ప్రయత్నిస్తే.. ఏపీకి రుణాలు ఇచ్చే పరిస్థితి లేదంటున్నారని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మేము ఆర్థిక క్రమ శిక్షణ పాటిస్తున్నాం.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాం.. ఒకటో తేదీనే పెన్షన్లు ఇస్తున్నాం.. ఈ ఏడాది రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టామని తెలిపారు. రాష్ట్రంపై రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని వెల్లడించారు. ఒక వైపు అప్పులకు వడ్డీ కడుతూనే.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కొనసాగించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.