Heritage foods: హెరిటేజ్‌కు కాసుల పంట.. 5 రోజుల్లో సంపాదన ఎంతంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ ఫుడ్‌కు కాసుల పంట మొదలైంది. మునుపెన్నడూ లేని విధంగా లాభాలను సొంతం చేసుకుంది. శుక్రవారం ఆల్‌టైమ్ రికార్డు లాభాలను అర్జించింది. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలుగు దేశం పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. అత్యధిక సీట్లను సొంతం చేసుకోవడమే కాకుండా.. రాష్ట్రంలోనూ.. కేంద్రంలోనూ చంద్రబాబు కింగ్ మేకర్‌గా నిలిచారు. దీంతో స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ ఫుడ్‌కు కొత్త ఊపు తీసుకొచ్చింది.
Also Read
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
- Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
- ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..

ఎన్నికల ఫలితాలకు ముందు జూన్ 3న హెరిటేజ్ ఫుడ్స్ రూ.424 దగ్గర ట్రేడ్ అవ్వగా.. శుక్రవారం రూ.661.25 దగ్గర ట్రేడ్ అయింది. దీంతో చంద్రబాబు భార్య భువనేశ్వరి సంపద ఐదు రోజుల్లో రూ.535 కోట్లు, కుమారుడు లోకేష్ రూ.237 కోట్లు సంపాదించారు. ఐదు రోజుల్లో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు 55 శాతం పెరిగాయి. హెరిటేజ్ ఫుడ్స్‌లో చంద్రబాబు ఫ్యామిలీకి 35.7 శాతం వాటా ఉంది. అందులో భువనేశ్వరికి 24.37 శాతం, కుమారుడు లోకేష్‌కు 10.82 శాతం, కోడలు బ్రాహ్మణికి 0.46 శాతం వాటా ఉంది. మనవడు దేవాన్ష్‌కు డెయిరీ కంపెనీలో 0.06 శాతం వాటా ఉంది. జూన్ 7న ఎన్ఎస్ఈలో హెరిటేజ్ ఫుడ్స్ షేరు 10 శాతం పెరిగి రూ.661.25 దగ్గర ముగిసింది.

హెరిటేజ్ ఫుడ్స్‌ను 1992లో చంద్రబాబు స్థాపించారు. కంపెనీ వెబ్సైట్ ప్రకారం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పబ్లిక్-లిస్టెడ్ కంపెనీల్లో ఒకటిగా హెరిటేజ్ కంపెనీ అభివర్ణించింది. హెరిటేజ్ సంస్థకు రెండు వ్యాపార విభాగాలు ఉన్నాయి. డెయిరీ మరియు పునరుత్పాదక శక్తి. ప్రస్తుతం హెరిటేజ్ నుంచి పాలు,పాల ఉత్పత్తులు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ల్లో హెరిటేజ్ ఫుడ్స్ అమ్ముడవుతున్నాయి.
జూన్ 4న వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఊహించని విక్టరీని సొంతం చేసుకుంది. టీడీపీ పోటీ చేసిన 17 స్థానాల్లో 16 సీట్లు గెలుచుకుంది. ఇక ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపులో కీలకపాత్ర పోషించింది. అలాగే మోడీ ప్రభుత్వంలో చంద్రబాబు కింగ్ మేకర్‌గా నిలిచారు. 543 స్థానాలున్న లోక్‌సభలో ఎన్డీయే 293 స్థానాలను గెలుచుకుంది. గత రెండు పర్యాయాల్లో చక్కని మెజారిటీ సాధించిన బీజేపీ ప్రభుత్వ.. తాజా ఫలితాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 మార్కు కంటే 240 సీట్లు మాత్రమే సాధించింది.
- Tags
- 5 days
- Heritage Foods
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!