స్టాక్ మార్కెట్‌లో హెరిటేజ్ ఫుడ్‌కు కాసుల పంట మొదలైంది. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలుగు దేశం పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. అత్యధిక సీట్లను సొంతం చేసుకోవడమే కాకుండా.. రాష్ట్రంలోనూ.. కేంద్రంలోనూ చంద్రబాబు కింగ్ మేకర్‌గా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన తర్వాత ఎన్. చంద్రబాబు నాయుడు స్థాపించిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్లు గత నాలుగు రోజులుగా రికార్డు పనితీరును కొనసాగిస్తున్నాయి. బలమైన పెరుగుదలను నమోదు చేస్తున్నాయి.