Site icon NTV Telugu

Chandrababu and Pawan Kalyan: ఢిల్లీకి చంద్రబాబు – పవన్‌ కల్యాణ్‌..! విషయం అదేనా..?

Pkbabu

Pkbabu

Chandrababu and Pawan Kalyan: ఏపీ పొలిటికల్‌ హీట్‌ ఢిల్లీని తాకబోతున్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే ఉమ్మడిగా అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన టీడీపీ – జనసేన పార్టీ.. ఇక, ఈ రోజు తాడేపల్లిగూడెం వేదికగా తొలి ఉమ్మడి సభ నిర్వహించనున్నారు.. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సభా స్థలికి చేరుకుంటున్నారు.. రెండు పార్టీలు ఈ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నాయి.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తో పాటు 500 మంది నేతలు వేదికను పంచుకోబోతున్నారు. ఈ సభకు దాదాపు 6 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా రెండు పార్టీల శ్రేణులకు నేతలు దిశానిర్ధేశం చేయనున్నారు.

Read Also: Telangana Temperature: తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మార్చిలో మరింతగా పెరగనున్న ఉష్ణోగ్రతలు!

అయితే, తాడేపల్లిగూడెం సభ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ వెళ్లనున్నారు.. ఇక, ఒకట్రోండు రోజుల్లో చంద్రబాబు – పవన్ కల్యాణ్‌ ఢిల్లీ వెళ్తారని ప్రచారం సాగుతోంది.. రేపు ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం జరగనుంది.. వచ్చే నెల మొదటి వారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.. దీంతో.. బీజేపీ తొలి జాబితా విడుదలకు ముందే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తో ఢిల్లీ బీజేపీ పెద్దలు భేటీ కానున్నారనే ప్రచారం సాగుతోంది.. ఇక, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఆరేడు ఎంపీ స్థానాలను ఆశిస్తోందట భారతీయ జనతా పార్టీ.. అరకు, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, ఒంగోలు, తిరుపతి, రాజంపేట, హిందూపురం లోక్ సభ స్థానాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్‌ చేసినట్టుగా తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ పర్యటన ఎలా సాగుతోంది.. పొత్తుల వ్యవహారం తేలుతుందా? మరోసారి టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version