Chandrababu Case: చంద్రబాబుకు మరో బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. మరో 11 రోజుల పాటు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబుకు రిమాండ్ పొడిగించారు. ఆయన రిమాండ్‌ను అక్టోబర్ 5 వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది. ఇప్పుడే అంతా అయిపోయిందని మీరు భావించాల్సిన అవసరం లేదని చంద్రబాబుతో జడ్జి చెప్పారు. మీరు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని చంద్రబాబుతో చెప్పిన న్యాయమూర్తి. విచారణ ప్రక్రియ ఇంకా చేయాల్సి ఉందని చంద్రబాబుతో అన్నారు.
Also Read: Chandrababu Case: చంద్రబాబు కస్టడీ, రిమాండ్ పొడిగించాలని కోరిన సీఐడీ
Also Read
- Explained: జోక్‌గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Summer Foods for Kids: డీహైడ్రేషన్‌కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
కస్టడీలో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా అని న్యాయమూర్తి చంద్రబాబును ప్రశ్నించగా.. ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని ఆయన సమాధానమిచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించారా అని అడిగిన ప్రశ్నకు.. నిర్వహించారని చంద్రబాబు బదులిచ్చారు. బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని.. సోమవారం బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు.
సీఐడీ రిమాండ్ పొడిగింపు పిటిషన్‌పై ఆదేశాల సమయంలో చంద్రబాబు లాయర్లపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఒకటికి పది పిటిషన్లు వేయడం వల్ల విచారణ చేయడం ఎలా అని.. ఒకే అంశంపై వరుస పిటిషన్ల వల్ల కోర్టు సమయం వృథా అవుతుందన్నారు. ఆదివారం నాడు సాయంత్రం సీఐడీ కస్టడీ పూర్తి కాగానే ఏసీబీ కోర్టు జడ్జి ముందు చంద్రబాబును వర్చువల్‌గా జైలు అధికారులు హాజరుపరిచారు. చంద్రబాబు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు. సీఐడీ న్యాయవాదులు కస్టడీ కోరుతూ మెమో దాఖలు చేయడంపై చంద్రబాబు తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఇవాళ్టితో రిమాండ్ ముగియడంతో చంద్రబాబు రిమాండ్‌ను మరో 11 రోజుల పాటు పొడిగిస్తున్నట్టుగా ఏసీబీ కోర్టు వెల్లడించింది.
తాజావార్తలు
-
Trump – Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్‌తో నెతన్యాహు ఫైర్!
-
Explained: జోక్‌గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
-
SBI Apprentice Recruitment 2026: ఎస్బీఐలో 7150 పోస్టులు.. మంచి జీతం.. అర్హతలు, ఎంపిక పూర్తి వివరాలు
-
Mega 158: ‘మెగా’ డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!