NTV Telugu Site icon

Chandrababu: ఉత్తరాంధ్రంలో 35 సీట్లు గెలిపించాలి.. ఓటర్లను కోరిన టీడీపీ అధినేత

Chandrababu

Chandrababu

ఉత్తరాంధ్రలో 35 సీట్లు గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటర్లను కోరారు. రాజాంలో జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. రాజాం సముద్రాన్ని మించిన జనసంద్రం ఇదని.. ఈ కార్యక్రమానికి జనాలు కమిట్ మెంట్ తో వచ్చారన్నారు. తాగునీటి కోసం ఉత్తరాంధ్రా సుజల స్రవంతి కోసం పోలవరం, వంశదార అనుసంధానం వల్ల తాగు, సాగు నీరు వస్తుందని తెలిపారు. దీనికి 2 వేల కోట్లు ఖర్చు పెట్టామని.. వైసీపీ 5 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. తారకరామతీర్థ సాగర్ కు రూ. 284 కోట్లు ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు. వైసీపీ రూ. 76 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు రూ. 237 కోట్లు ఖర్చు చేస్తే.. ప్రస్తుత అధికార పార్టీ రూ. 64 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ ప్రాంతం బాగుపడాలంటే సాగునీరు అవసరం ఎంతైనా ఉందన్నారు. సలహాలదారులకు రూ. వెయ్యి కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపించారు.

Read Also: Oman Floods: ఒమన్‌లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 13 మంది మృతి, పలువురు గల్లంతు

ఆ డబ్బులు ఇరిగేషన్ కోసం ఖర్చు పెడితే ఉత్తరాంధ్రాకు మంచి జరిగేదన్నారు. వేలాది మంది పెట్టుబడులు రాకతో హైదరాబాద్ ఆర్థికంగా ఎదిగిందన్నారు. భోగాపురం శంకుస్థాపన చేసి భూమి ఇచ్చానని.. ప్రారంభించి ఉంటే అభినందించేవాడినన్నారు. గిరిజన యూనివర్సిసీటీకి 550 ఎకరాలు వెచ్చించి ప్రారంభిస్తే దాని జాడే లేదన్నారు. తాను వేసిన పాన్ల ప్రకారం జరిగుంటే ఈ ప్రాంతం అంతా ఆర్థికంగా ఎదిగేదన్నారు. విశాఖపట్నం గంజాయి రాజధానిగా మారిందన్నారు. కార్పోరేట్ కంపెనీలన్నింటినీ తరిమేశారని ఆరోపించారు. బీసీలకు తాను ఇచ్చిన పథకాలు రద్దు చేశారన్నారు. ఉత్తరాంధ్ర మీద సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి పెత్తనం ఏమిటన్నారు. అప్పలనాయుడు ఒక సామాన్య కార్యకర్తను ఎంపీగా ఇస్తున్నానన్నారు. సజ్జల మాటలు ఎలా ఉన్నాయంటే జగన్ మీద గులకరాయి పడితే తెలుగోడి మీద రాయిపడినట్లట.. అసెంబ్లీలో నా భార్యను ఇష్టారాజ్యంగా తిట్టాలేదా అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: Attack on CM Jagan Incident: కొంత మందిపై అనుమానం ఉంది.. అక్కడి నుంచే రాయి విసిరారు..