NTV Telugu Site icon

Chandra Grahan 2023: చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఏపీలో మూతపడ్డ ఆలయాలు..

Temples

Temples

పాక్షిక చంద్రగ్రహణంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు మూతపడ్డాయి. ఇవాళ ఏపీలోని అన్ని ఆలయాల తలుపులు మూసివేశారు. దాదాపు 8 గంటల పాటు ఆలయాల తలుపులు మూసి ఉంచనున్నారు. అలాగే రేపు తెల్లవారు జాము నుంచి సంప్రోక్షణ అనంతరం ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఇక, చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు. తిరిగి రేపు వేకువజామున 3:15 గంటలకు ఆలయ తలుపులను అర్చకులు తెరవనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ.. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేసాం.. రేపు ఉదయం ఆలయ తలుపులు తెరిచి శుద్ది చేస్తారు.. సుప్రభాతం ఏకాంతంగా నిర్వహించి.. తోమాల, అర్చన సమయంలో భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నాని చెప్పారు. ఇవాళ 42 వేల మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించామని ఆలయ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

Read Also: Miniter Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్రోహుల చేతిలోకి వెళ్ళింది..

అలాగే, చంద్రగ్రహణం వల్ల నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేశారు. శ్రీస్వామి అమ్మవారి ఉభయ ఆలయాలు, పరివార ఆలయాలను బంద్ చేశారు. రేపు తెల్లవారుజామున 5 గంటలకు అర్చకులు ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ చేయనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనానికి ఆర్జిత సేవలకు అనుమతించనున్నారు. ఈరోజు సాయంత్రం, రాత్రి జరిగే ఆర్జిత సేవ, శ్రీస్వామి అమ్మవారి కళ్యాణం నిలుపివేశారు. రాత్రి భక్తులకు అందించే అల్పాహారం కూడా నిలిపివేసినట్లు పేర్కొన్నారు.

Read Also: Allu Arjun : వరుణ్ – లావణ్య పెళ్లి కోసం కుటుంబ సమేతంగా ఇటలీ బయలుదేరిన ఐకాన్ స్టార్…

ఇక, రాహుగ్రస్త పాక్షిక చంద్ర గ్రహణము కారణంగా ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానము కూడా చంద్రగ్రహణంతో మూసివేశారు. ఆగమశాస్త్ర ప్రకారము అమ్మవారి ప్రధానాలయం, ఇతర ఉప ఆలయముల కవాట బంధనం.. అమ్మవారికి పంచ హారతులను నిలిపి వేసి అర్చకులు కవాట బంధనం చేశారు. గ్రహణం అనంతరం రేపు ఉదయం వేకువజామున 3 గంటలకు అమ్మవారి ప్రధానాలయము, ఉప ఆలయముల కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నపనాభిషేకములు చేయనున్నారు. రేపు ఉదయం9 గంటలకు ప్రతీ నిత్యము వలనే భక్తులకు దర్శనము పునః ప్రారంభించి ఆర్జిత సేవలు నిర్వహణ చేస్తారు. రేపు తెల్లవారుఝామున నిర్వహించు ఆర్జిత సేవలు, సుప్రభాతం, వస్త్రం సేవ మరియు ఖడ్గమలార్చనను నిలిపివేశారు. ఆ తర్వాత ప్రారంభమగు అన్ని ఆర్జిత సేవలు యధావిధిగా జరుగుతాయని ఆలయాధికారులు తెలిపారు.

Read Also: Vijay Deverakonda : విజయ్ దేవరకొండా.. ఇది కదా అసలైన సక్సెస్ అంటే!

అలాగే, చంద్రగ్రహణం సందర్భంగా కాకినాడలోని అన్నవరం సత్యదేవుని ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. రేపు ఉదయం 5 గంటలకు ఆలయ సంప్రోక్షణ అనంతరం వ్రతాలు దర్శనాలు ప్రారంభం అవుతాయి. ఇక, మహానందిలో ఆలయం మూసివేశారు. దేవతామూర్తులకు పవిత్రంతో ఆఛ్ఛాదన చేసిన వేద పండితులు.. రేపు ఉదయం 6 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ.. 8 గంటల నుంచి భక్తుల సందర్శనకు అనుమతి ఇచ్చింది. ఇక, చంద్రగ్రహణం కారణంగా పద్మావతి అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. రేపు ఉదయం ఐదు గంటలకు ఆలయ శుద్ది అనంతరం తెరిచుకోనున్న ఆలయం.. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగా మూసివేశారు.