Telangana Rains: తెలంగాణలో వర్షాలు.. రెండ్రోజుల పాటు కురిసే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rains: తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా అధికారులు ప్రకటించారు. ఈశాన్య రుతుపవనాల రాకతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. నేడు హైదరాబాద్ సహా మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, ఖమ్మం, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, నారాయణపేట, వికారాబాద్ వనపర్తి జిల్లాల్లో వర్షం కురుస్తుంది. ఇందుకోసం సంబంధిత జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములతో పాటు గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం (నవంబర్ 8) హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది.
మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అమీర్ పేట, కూకట్ పల్లి, ఖైరతాబాద్, చందానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, యూసుఫ్ గూడ, మియాపూర్, చింతల్, షాహాపూర్, హిమాయత్ నగర్, సికింద్రాబాద్, బోయినపల్లి, కుత్బుల్లాపూర్, సూరారం, సుచిత్బుల్లాపూర్, ., కొంపల్లి, దూలపల్లి, మల్లంపేట, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజులరామారం, గండిమైసమ్మ, బహుదూర్ పల్లిలో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. వర్షం నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని చోట్ల వర్షం లేదా మేఘావృతమైన వాతావరణం ఉండే అవకాశం ఉందన్నారు.
CM YS Jagan: నేడు, రేపు సీఎం జగన్ అన్నమయ్య, కడప జిల్లాల్లో పర్యటన
Also Read
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
తాజావార్తలు
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
-
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
TVS iQube MillionR Edition: 145KM రేంజ్‌తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్‌తో MillionR Edition!
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!