నేటి అత్యాధునిక యుగంలో టెక్నాలజీ ఎంత ముందుకు పోయినా.. ప్రాచీన కాలల్లో దాగున్న రహస్యాలను తెలుసుకోలేకపోతోంది అనడంలో అతిశయోక్త లేదు. మన పూర్వీకులు అందించిన వైద్యజ్ఞాన సంపదను పక్కకు పెట్టి.. ఆధునాతన వైద్యాల కోసం పరుగులు పెడుతున్నాం. అయితే.. డాక్టర్ సత్య సింధూజ మాత్రం ప్రాచీన వైద్యంపై మక్కువతో ప్రజలు ఈ వైద్య అందాలనే సదుద్దేశంతో ‘‘చక్ర సిద్ధ’ పేరుతో సహజ చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎలాంటి ఔషధాల ప్రమేయం లేకుండా.. శరీరం తన లోని అంతర్గత చికిత్సాసామర్థ్యంతో వ్యాథుల్నితనంత తానుగా నయం చేసే మహిమాన్విత శక్తిని సింధూజ గారు అతి చిన్న వయసు లో స్వయంగా చూశారు. కాలక్రమేణ ‘సిద్ధ వైద్యం’ ద్వారా లభించిన సానుకూల ఫలితాల నేపథ్యంలో డాక్టర్ సింధూజ ‘చక్ర సిద్ధ’ పేరుతో సహజ చికిత్స ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అందించే ఆశ్రమాన్ని నెలకొల్పారు. ప్రాచీన కాలం నాటి నాడీ వైద్య విధానాన్ని మర్మ చికిత్సా విధానంతో మేళవించి, అధునాతన ప్రక్రియలో చికిత్సను అందించటం ఈ ఆశ్రమ ప్రత్యేకత. బాధల మూల కారణాలను లక్ష్యం గా చేసుకుని, ‘చక్ర సిద్ధ’ ఒక విలక్షణ పద్ధతికి చెందిన చికిత్సను అందిస్తుంది. శరీరం లోని శక్తి కేంద్రాలలో నెలకొన్న అవరోధాలను తొలగించి, కీలకమైన ప్రాణ శక్తి స్వేచ్ఛగా ప్రవహించేలా చేసి, శరీరంలో సమతుల్య స్థితిని, తనంతట తాను చికిత్స (సెల్ఫ్ హీలింగ్) చేసుకునే సామర్థ్యాన్ని తిరిగి నెలకొల్పడం ‘చక్ర సిద్ధ ‘ లోని కీలకమైన అంశం.
‘చక్రసిద్ధ ‘- ఈ సంస్కృత పదానికి‘ శక్తి నాడుల ద్వారా చికిత్స’ అని అర్థం. ఇదే మా సాధన తాలూకు సారాంశం కూడా. వ్యక్తులు తమ శరీరాలను అర్థం చేసుకుని, వ్యాథిని తనకు తాను నయం చేసుకునే అంతర్గత శక్తిని పెంపొందించుకునే దిశగా, సానుభూతితో, ప్రత్యేక సంరక్షణను అందించటం మా ఆశయమని డాక్టర్ సింధూజ చెబుతున్నారు. భయం, గాయాల బెదురు, గత సంఘటనల బాధామయ జ్ఞాపకాలు , ప్రతికూల పరిస్థితులు వంటి భౌతిక , మానసిక కారణాలు శరీరం లోని ప్రాణ శక్తి ప్రవాహానికి అవరోధాలుగా నిలుస్తాయి. ఈ దురవస్థల్ని మనసు మరచిపోయినా సరే, శరీరం, అంతర్వాణి , నాడీ వ్యవస్థల జ్ఞాపకాల్లో ఈ అపరిష్కృత సమస్యలు శక్తి కేంద్రాల పాలిట అవరోధాలుగా మిగిలిపోతాయి. అయితే వీటిని చక్ర సిద్ధ వైద్యం ద్వారా తొలగించవచ్చని ఆమె తెలిపారు.
చక్రసిద్ధ్ యొక్క ప్రయాణం సిద్ధ వైద్యం యొక్క ప్రాచీన జ్ఞానంతో ప్రారంభమవుతుంది, ఇది 36 తరాల ద్వారా అందించబడింది, డాక్టర్ సత్య సింధూజ ద్వారా జీవం పోసింది. సంపూర్ణ వైద్యం యొక్క పరివర్తన శక్తికి ఆకర్షితులై, డాక్టర్ సింధూజ తన అమ్మమ్మ ప్రేమతో కూడిన మార్గదర్శకత్వంలో ఈ పురాతన విధానాన్ని నేర్చుకోవడానికి, ఆచరించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. చిన్నప్పటి నుండి, ఆమె శరీరం యొక్క సహజ స్వీయ-స్వస్థత సామర్థ్యాలపై ఆధారపడి, మందులు లేకుండా వైద్యం చేసే అద్భుతాలను చూశారు. అయితే.. ఇప్పటి వరకు 15 పైచిలుకు శాస్త్రీయ పరిశోధన పత్రాలను సమర్పించారు. సంపూర్ణ ఆరోగ్యకర జీవన విధానం పై ఆమెకు ప్రగాఢ విశ్వాసం. సంపూర్ణ చికిత్సను అందించే సిద్ధ వైద్య విజ్ఞాన పద్ధతులు అందరికీ అందుబాటులో ఉండాలని, వాటి ద్వారా మానవాళికి సంపూర్ణమైన భౌతిక, మానసిక ఆరోగ్యాలు చేకూరాలని డాక్టర్ సింధుజ గారు ఆకాంక్షిస్తున్నారు. డాక్టర్ సత్య సింధూజ స్థాపించిన చక్రసిద్ధ్ 36 తరాల సిద్ధ వైద్యాన్ని ఆధునిక పద్ధతులతో అనుసంధానం చేశారు. మా సంపూర్ణ విధానం నాడి వైద్యం, మర్మ చికిత్స వంటి పురాతన పద్ధతులను మిళితం చేసి సమతుల్యతను పునరుద్ధరించడానికి, మీ అన్‌బ్లాక్ చేయడం ద్వారా స్వీయ-స్వస్థతను ప్రోత్సహిస్తుందని ఆమె పేర్కొన్నారు.