NTV Telugu Site icon

Bandru Sobharani: కేటీఆర్ పై మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ ఘాటు వ్యాఖ్యలు!

Bandru Sobharani Ktr

Bandru Sobharani Ktr

కేటీఆర్ పై మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ బండ్రు శోభారాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఆమె మాట్లాడుతూ.. “పబ్బులు తిరిగే లోపర్ నా కొడుకు.. చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. అవినీతిని కప్పి పుచ్చుకోవడానికే విగ్రహాల రాజకీయం చేస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టాలో తెలియలేదా. తెలంగాణ తల్లి హుందాతనం తీసుకొచ్చి మరింత గౌరవం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు. కొంత మంది మేధావుల పేరుతో ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ముడుపుల కోసం కొంత మంది మేధావులు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారు.” అని ఫైర్ అయ్యారు.

READ MORE: Atchutapuram Sez: కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్‌.. 18 మందికి పైగా తీవ్రగాయాలు

కాగా.. రాష్ట్ర రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై అధికార, ప్రతిపక్షాలు ప్రచ్ఛన్న యుద్ధానికి దిగాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సచివాలయానికి ఓ వైపు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, ఎదురుగా అమలవీరుల స్మారక స్థూపం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పెట్టాలని నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం స్థలాన్ని కూడా కేటాయించింది. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఏర్పాట్లు కూడా పూర్తి విగ్రహావిష్కరణకు చీఫ్ గెస్ట్ గా రాహుల్ గాంధీని ఆహ్వానించింది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారంటూ బీఆర్ఎస్ నేతలు ఫైరయ్యారు. ఇటీవల కేటీఆర్ మాట్లాడుతూ భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విగ్రహాన్ని తొలగిస్తామని, దీంతో పాటు రాజీవ్ ఆరోగ్య శ్రీ, రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేర్లను కూడా మారుస్తా మన్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.