Site icon NTV Telugu

Chada Venkat Reddy : కేంద్రంలో, రాష్టంలో పార్టీ జెండాలు మారిన పేదల బతుకులు మాత్రం మారలేదు

Chada Venkat Reddy

Chada Venkat Reddy

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గుట్టల్లో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల సమాధుల వద్ద పూలమాలలువేసి నివాళులర్పించారు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి, ప్రజా సమస్యల పరిస్కారం కోసం సమర శీల పోరాటానికి సీపీఐ సన్నద్ధమైందన్నారు. హిందూ సామ్రాజ్యం పేరుతో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చేస్తున్నారని, రియాలటర్లు, కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపి పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘కేంద్రంలో, రాష్టంలో పార్టీ జెండాలు మారిన పేదల బతుకులు మాత్రం మారలేదు.

Also Read : Ganta Srinivas Rao: ప్రభుత్వ నిర్ణయాల డొల్లతనం బయటపడింది

ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి రోజు నుండి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం పల్లెపల్లెకు సీపీఐ కార్యక్రమం. భూమి, భూక్తి, విముక్తి కోసం నాడు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది. నాటి పోరాటల ఫలితంగానే తెలంగాణ సిద్దించింది, కానీ వీరుల చరిత్రను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోంది. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి మహమ్మదాపూర్ గుట్టల ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేద్దుందుకు కృషి చేస్తా.’ అని ఆయన అన్నారు.

Also Read : Bandi Sanjay : ఉద్యోగాలివ్వలేక… ఇంత దారుణాలకు ఒడిగడతారా?

Exit mobile version