Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Govt Issues High Risk Warning For Google Chrome Users In India: కేంద్ర ప్రభుత్వ సైబర్ భద్రత సంస్థ ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్)’ గూగుల్ క్రోమ్ యూజర్లను అప్రమత్తం చేసింది. క్రోమ్ బ్రౌజర్లోని పలు లోపాల కారణంగా మీ డెస్క్‌టాప్ కంప్యూటర్ను సైబర్ నేరగాళ్లు రిమోట్‌గా యాక్సెస్ చేయొచ్చని హెచ్చరించింది. పాత వెర్షన్లు హ్యాకింగ్ ప్రయత్నాలకు గురయ్యే అవకాశం ఉందని సెర్ట్-ఇన్ పేర్కొంది. హ్యాకర్లు మీ కంప్యూటర్ సిస్టమ్‌ను నియంత్రించడానికి, మీ డేటాను దొంగిలించడానికి లేదా మాల్వేర్ని ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పింది.
డెస్క్‌టాప్‌లలో గూగుల్ క్రోమ్ విండోస్, మ్యాక్ వెర్షన్ 124.0.6367.201/ .202.. లైనక్స్ 124.0.6367.201 కంటే ముందు వెర్షన్ల బ్రౌజర్లను వినియోగిస్తున్న వారికి ఈ ముప్పు పొంచి ఉందని సెర్ట్-ఇన్ తెలిపింది. విజువల్స్, గ్రాఫిక్స్ మరియు ఆడియోకు సంబంధించిన భాగాలలో హ్యాకర్లు మాల్వేర్ని ఇన్స్టాల్ చేయొచ్చని.. దాంతో మీ సిస్టమ్ మెమరీని హ్యాకింగ్ చేస్తారని పేర్కొంది. మీ సిస్టమ్‌లోని సున్నితమైన సమాచారాన్ని బయటపెట్టే ప్రమాదం ఉందని సెర్ట్-ఇన్ తన హెచ్చరికల్లో పేర్కొంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. వెంటనే గూగుల్ క్రోమ్ లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
Also Read: CSK vs RR: రాజస్థాన్‌పై విజయం.. చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం!
యాపిల్ ఐట్యూన్స్ వాడే వారు కూడా అప్రమత్తంగా ఉండాలని సెర్ట్-ఇన్ హెచ్చరించింది. వెంటనే లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఐట్యూన్స్ ఓపెన్ చేసి.. హెల్ప్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ ఫర్ అప్డేట్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే.. మీ ఐట్యూన్స్ అప్డేట్ అవుతుంది. గూగుల్ క్రోమ్ అయితే ఎగువ కుడి మూలలో ఉన్న మూడు నిలువు చుక్కలను క్లిక్ చేయాలి. హెల్ప్ ఆప్షన్ క్లిక్ చేస్తే.. ఏబౌట్ గూగుల్ క్రోమ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!