NTV Telugu Site icon

Metro Corridor: రిథాలా-నరేలా-కుండ్లీ మెట్రో కారిడార్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం..

Metro Coridor

Metro Coridor

మెట్రో రెడ్ లైన్ విస్తరణకు మార్గం సుగమమైంది. రిథాలా-నరేలా-కుండ్లీ మెట్రో కారిడార్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డీడీఏ (DDA) పంపింది. ఈ మేరకు శనివారం రాజ్‌నివాస్‌ వెల్లడించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ మెట్రో కారిడార్ నిర్మాణ అంశాన్ని కేంద్రంతో వివిధ సందర్భాల్లో ప్రస్తావించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Read Also: Auto Accident: ఆటోలో నుంచి ఎగిరిపడ్డ డ్రైవర్.. ఆపై రోడ్డుపై ఉన్న మనుషులపైకి..

రూ.6,231 కోట్లతో రిథాలా-నరేలా-కుండ్లి మెట్రో కారిడార్‌ను నిర్మించనున్నారు.ఇందులో ఢిల్లీలో పడే భాగానికి రూ.5,685.22 కోట్లు, హర్యానాలో పడే భాగానికి రూ.545.77 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రణాళిక ప్రకారం.. ఈ కారిడార్ ప్రస్తుత రెడ్ లైన్‌కు పొడిగింపుగా నిర్మించనున్నారు. మరోవైపు.. ఢిల్లీ భాగానికి అయ్యే ఖర్చులో 40 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డిడిఎ) మిగిలిన ఖర్చుకు రూ. 1,000 కోట్లు సమకూరుస్తుంది. అయితే మూలధనంలో 37.5 శాతం ద్వైపాక్షిక / బహుపాక్షిక రుణాల నుండి వస్తుంది. ఖర్చులో 20 శాతం ఢిల్లీ ప్రభుత్వం భరిస్తుంది.

Read Also: Rajeev Chandrasekhar: ఈవీఎంలను తొలగించాలన్న ఎలాన్ మస్క్.. వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి వివరణ

మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం సబ్సిడీని అందిస్తుంది. మిగిలిన 20 శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ లైన్ నిర్మాణం నాలుగేళ్లలో పూర్తవుతుందని, 26.5 కిలోమీటర్ల పొడవునా 21 స్టేషన్లు ఉంటాయన్నారు. ఇది నరేలా, బవానా మరియు అలీపూర్ ప్రాంతాలను నగరంలోని మిగిలిన ప్రాంతాలతో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని.. మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు.