NTV Telugu Site icon

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల పాస్‌పోర్టులను సస్పెండ్ చేసిన కేంద్రం

Phone Tapping Case

Phone Tapping Case

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల పాస్‌పోర్టులను కేంద్రం సస్పెండ్ చేసింది. ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావు పాస్‌పోర్టును కేంద్రం సస్పెండ్ చేసింది. పాస్‌పోర్ట్‌ సస్పెండ్‌ను ప్రభాకర్ రావు సవాల్ చేశారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వద్ద ప్రభాకర్ రావు తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. కీలక నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్‌ రావుల పాస్ పోర్టులను రద్దు చేయాలని పోలీసులు సిఫారసు చేశారు. మరోసారి కేంద్రానికి ఇద్దరి పాస్‌పోర్టులు రద్దు చేయాలని పోలీసులు సిఫారసు చేశారు.

Read Also: Vikarabad: మిస్టరీగా 4వ తరగతి విద్యార్థి మిస్సింగ్ ఘటన.. తొమ్మిది రోజులైనా దొరకని ఆచూకీ..

మరోవైపు ఇంటర్ పోల్ ద్వారా ఇద్దరిని ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించి ప్రభాకర్ రావును హైదరాబాద్ రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని ప్రభాకర్‌ రావు పిటిషన్ వేసుకున్నారు. కేసు తనకు సంబంధం లేదని బెయిల్ మంజూరు చేయాలని శ్రవణ్‌ రావు కోర్టును ఆశ్రయించారు.