NTV Telugu Site icon

Big Breaking: కేంద్రం సంచలన నిర్ణయం.. సీఏఏ చట్టం అమలుకు నేడే నోటిఫినేషన్‌!

Caa

Caa

Centre likely to notify CAA rules today: త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’పై ఇవాళే రూల్స్‌ నోటిఫై చేయనున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల తర్వాత నేడు వాస్తవరూపం దాల్చనున్నట్లు సమాచారం. ఈ రాత్రిలోగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూల్స్‌ను నోటిఫై చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల హోమ్ శాఖలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

Read Also: Karnataka: గోబీ మంచూరియా, పీచు మిఠాయిపై నిషేధం

ఫిబ్రవరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, 2019లో అమలులోకి వచ్చిన సీఏఏ, ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నిబంధనలను జారీ చేసిన తర్వాత అమలులోకి వస్తుందని చెప్పారు. డిసెంబర్ 11, 2019న పార్లమెంటులో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం-2019(CAA) భారతదేశం అంతటా తీవ్ర చర్చ, విస్తృత నిరసనలకు సంబంధించిన అంశం. దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడం గమనార్హం. కానీ ఇంతవరకూ దీనిపై నిబంధనలు రూపొందించక పోవడంతో ఈ చట్టం అమలులోకి రాలేదు. ఈ క్రమంలోనే చట్టం నిబంధనపై కేంద్రం నేడు కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. లోక్‌ సభ ఎన్నికలకు ముందే దీనిని అమలు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.

Read Also: Pakistan: షెహబాజ్‌ షరీఫ్‌ కేబినెట్‌లో 19 మందికి చోటు!

ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ, పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందూ, సిక్కు, జైన్, పార్సీ, బౌద్ధ, క్రిస్టియన్ కమ్యూనిటీలకు చెందిన, అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించిన వారికి భారత పౌరసత్వానికి వేగవంతమైన మార్గాన్ని అందించడానికి 1955 పౌరసత్వ చట్టాన్ని కేంద్రం సవరించింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వర పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందిస్తోంది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఈ చట్టంలో ముస్లింలను మినహాయించడంపై వివాదం నెలకొంది.

Show comments