NTV Telugu Site icon

Cabinet Decisions: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్‌.. కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం

Ashiwin

Ashiwin

ప్రభుత్వ ఉద్యోగుల్లో పాత పెన్షన్ స్కీమ్ (OPS) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్)కి బదులుగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 25 ఏళ్లు పని చేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. యూపీఎస్ పథకం ద్వారా 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఈ పథకం 2025 ఏప్రిల్ 1 నుండి అమలు చేయనుంది.

Satyabhama: వరంగల్‌లో స్టార్ మా ‘సత్యభామ’ టీం వరలక్ష్మీ వ్రతం వేడుకలు

కేబినెట్ సమావేశానికి సంబంధించిన సమాచారంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. పదేళ్లు సర్వీస్ చేసిన వారికి రూ.10,000 పింఛన్ వస్తుందని తెలిపారు.అలాగే ఉద్యోగులు సర్వీసులో ఉండగా చనిపోతే వారి భార్యలకు 60 శాతం పెన్షన్ ఇస్తారని పేర్కొన్నారు. ఎన్‌పిఎస్ పథకాన్ని మెరుగుపరచాలని దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల నుండి ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని అన్నారు. 2023 ఏప్రిల్‌లో ప్రధాని మోడీ ఈ సంస్కరణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీకి డాక్టర్ సోమనాథన్ అధ్యక్షుడిగా ఉన్నారని.. ఈ కమిటీ 100కు పైగా ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలతో మాట్లాడిందని తెలిపారు. ఈ కమిటీ దాదాపు అన్ని రాష్ట్రాలతో చర్చలు జరిపిందని.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ఈ అంశాన్ని ప్రధాని సీరియస్‌గా తీసుకుని.. కమిటీ సిఫార్సు మేరకు సమీకృత పింఛను పథకాన్ని ప్రభుత్వం ఆమోదించిందని పేర్కొన్నారు.

Andhra Pradesh: భారత్ నెట్ ప్రాజెక్టు కోసం కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

అలాగే.. బయో ఈ-3 విధానానికి కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ తెలిపింది. ‘ఈ-3 అంటే ఎకానమీ, ఎన్విరాన్ మెంట్, ఎంప్లాయిమెంట్. ఐటీ, ఇండస్ట్రియల్ మాదిరి త్వరలో బయో విప్లవం రానుంది. భవిష్యత్ లో బయో టెక్నాలజీ, బయో సైన్స్ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు వస్తాయి’ అని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అంతేకాకుండా.. 11, 12 తరగతి విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.