Giriraj Singh: త్వరలో పంచాయితీలకు నిధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిధులు లేక కునారిల్లుతున్న పంచాయితీలకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం ఢిల్లీలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ను కలిసింది. పంచాయితీ నిధుల విడుదల పై కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కలిసిన ఏపీ సర్పంచులకు ఈమేరకు హామీ లభించింది. 15వ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసిన రెండవ విడత నిధులు 581 కోట్ల పంచాయితీ నిధులు త్వరలో విడుదల చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.
గ్రామ పంచాయితీ ఖాతాల్లోనే కేంద్రం నిధులు వేయాలని కేంద్రమంత్రిని కోరారు ఏపీ సర్పంచుల సంఘం ప్రతినిధులు. కేంద్ర పంచాయితీ నిధులు గ్రామాల్లో ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తాం. పంచాయతీల అభివృద్ధి పై కేంద్ర మంత్రి కీలక సూచనలు చేశారు. పంచాయితీ నిధులు విడుదల చేస్తామన్న కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలిపింది ఏపీ సర్పంచుల సంఘం. గ్రామాల్లో పంచాయితీ విద్యుత్ బిల్లులు తగ్గించుకోవడం కోసం సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని కేంద్రమంత్రి సూచించారు.
Also Read
గ్రామాల్లో సెల్ ఫోన్ టవర్లకు పంచాయితీలు పన్నులు వసూలు చేయాలని కేంద్రమంత్రి సూచించారు. గ్రామ పంచాయితీకి ఆదాయం సమకూర్చుకోవాలని కేంద్రమంత్రి సూచనలు చేశారు. గ్రామ సమస్యలు,యువత,కేంద్ర రాష్ట్ర పథకాలు, సంక్షేమ అంశాలపై సభలు పెట్టుకోవాలని కేంద్రమంత్రి సూచించారు. నిధులు లేక అల్లాడుతున్న తమకు కేంద్రమంత్రి హామీ ఉపశమనంగా వుందన్నారు ఏపీ సర్పంచుల సంఘం ప్రతినిధులు.
GO First Flight: గో ఫస్ట్ ఫ్లైట్ కు తప్పిన ముప్పు.. అత్యవసరంగా ల్యాండింగ్
తాజావార్తలు
-
Bharat Taxi Launch: ఓలా, ఉబర్‌లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
-
Ganja Smuggling : శంషాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
-
PM Modi: సీషెల్స్‌లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
-
NCERT: 9వ తరగతి సిలబస్‌లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
-
Jackky Bhagnani: హీరోయిన్ రకుల్‌తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్‌లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!