Current Bill: కేంద్రం కీలక నిర్ణయం.. కరెంట్ బిల్లులు భారీగా తగ్గే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Current Bill: ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు మధ్య తరగతి వ్యక్తి బతకడమే కష్టంగా మారింది. ఏ వస్తువును ముట్టుకున్న ధరల మంటమండుతోంది. కాస్తంత ఆ మంట నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్ వేస్కుందాం అంటే కరెంట్ బిల్ షాక్ కొడుతోంది. దీంతో చావ లేక బతకలేక సామాన్యుడు నానాయాతన పడుతున్నారు. ప్రభుత్వాలు ప్రజలపై నిరంతరం అటు పన్నులు, ఇటు చార్జీలు పెంచుకుంటూ పోతున్నాయి. ఈ మధ్య కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరెంట్ బిల్లులు అమాంతం పెంచేశాయి. వినియోగం తక్కువగా ఉన్నా బిల్లు ఎక్కువగా వస్తోందని జనాల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే కేంద్రం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించే చల్లటి వార్తను చెప్పింది. దీంతో రానున్న రోజుల్లో మీ కరెంటు బిల్లులు భారీగా తగ్గే అవకాశం ఉంది. సామాన్య, మధ్య తరగతి విద్యుత్ వినియోగదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ రూల్స్ 2020 చట్టంలో సవరణలు చేసింది. దీని ద్వారా వినియోగదారులు తమ కరెంట్ బిల్లులను తగ్గించుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. టైమ్ ఆఫ్ డే (టీవోడీ) టారిఫ్ విధానం ద్వారా ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ టారిఫ్ విధానంలో మార్పులు అమల్లోకి రానున్నాయి. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వినియోగదారులకు విద్యుత్ బిల్లుల నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Read Also:WHO: కరోనా పోయింది.. కానీ మరో ముప్పు ముందుంది.. భయపడుతున్న WHO
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
టైమ్ ఆఫ్ డే టారిఫ్ సిస్టమ్ అనేది గరిష్ట విద్యుత్ డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది. 10 కిలోవాట్ల కంటే ఎక్కువ వాడకం ఉన్న వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఇది ఏప్రిల్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. ఇవి కాకుండా వ్యవసాయ వినియోగదారులు మినహా మిగిలిన వినియోగదారులందరికీ ఇది ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వస్తుంది. తాజాగా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ టారిఫ్ సిస్టమ్ పరిధిలోకి వచ్చే వారికి సోలార్ హవర్స్ లో 20 శాతం తక్కువగా ఉంటుంది. అలాగే పీక్ డిమాండ్ సమయాల్లో కరెంట్ 10 నుంచి 20 శాతం ఎక్కువగా ఉంటుంది. టీఓడీ నిబంధనలను కచ్చితంగా పాటించే వారికి ప్రయోజనాలు లభిస్తాయని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. మీటరింగ్ నిబంధనలలో చేసిన సవరణల ప్రకారం, స్మార్ట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులపై ఎటువంటి పెనాల్టీ ఛార్జీలు విధించబడవు. ఈ మీటర్లను ఇన్‌స్టాల్ చేసే ముందు గరిష్ట డిమాండ్ నమోదు చేయబడుతుంది కాబట్టి, పెనాల్టీకి అవకాశం ఉండదు. వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన కరెంటు అందించాలనే ఉద్దేశంతో విద్యుత్తు నిబంధనలను సవరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Read Also:Sajjala Ramakrishna Reddy: పవన్ రాజకీయ నాయకుడే కాదు.. కులంపైనే యాత్ర..!
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!