Central Gaza : గాజాలోని శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. 94 మంది పాలస్తీనియన్లు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Gaza : సెంట్రల్ గాజాలోని నుస్రత్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడిలో 94 మంది పాలస్తీనియన్లు మరణించారు.. 200 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని అల్-అక్సా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అల్-అక్సా హాస్పిటల్ నిరంతర కార్యకలాపాలను నిర్వహించడానికి, వైద్య అవసరాలు, జనరేటర్లను సరఫరా చేయాలని అంతర్జాతీయ సంస్థలకు ఎమర్జెన్సీ రిక్వె్స్ట్ చేశారు. అల్-అక్సా హాస్పిటల్ ఇజ్రాయెల్ బాంబు దాడి కారణంగా మరణించిన, గాయపడిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశాం ఉంది.
అంతకుముందు రోజు, అల్-అక్సా ఆసుపత్రి ప్రతినిధి ఖలీల్ అల్-దక్రాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నుస్రత్ శిబిరంపై ఇజ్రాయెల్ దాడి ఫలితంగా 55 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఆసుపత్రి కిక్కిరిసిపోయి రోగులకు ఆస్కారం లేదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఫిరంగిదళాలు, యుద్ధ విమానాలు దీర్ అల్-బలాహ్, అల్-బురిజ్, అల్-మఘాజీ శిబిరాలకు తూర్పున ఉన్న ప్రాంతాలతో పాటు, నుస్రాత్ శిబిరం మధ్యలో, పశ్చిమం, తూర్పున ఉన్న వివిధ ప్రదేశాలపై గంటల తరబడి బాంబు దాడి చేస్తున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఫిరంగి బాంబు దాడుల కారణంగా సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని అన్ని ప్రాంతాల నుండి నల్లటి పొగలు ఎగసిపడుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
Read Also:IND vs PAK: నేడే హాయ్ వోల్టాజే మ్యాచ్.. జోరుమీదున్న టీమిండియాను పాక్ ఆపగలదా..
ఇజ్రాయెల్ సైనిక వాహనాలు అకస్మాత్తుగా నుస్రత్ శిబిరానికి తూర్పు , వాయువ్య ప్రాంతాలలోకి ప్రవేశించి, శిబిరంలోని పెద్ద భాగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇజ్రాయెల్ డ్రోన్లు నుస్రత్ క్యాంప్ మీదుగా ఎగురుతున్నాయి. శిబిరం వీధుల్లో నడుస్తున్న వారిపై వారు కాల్పులు జరుపుతున్నారు. ఫలితంగా అనేక మంది చనిపోగా చాలామందికి గాయాలవుతున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులు, షెల్లింగ్ కారణంగా డజన్ల కొద్దీ ప్రజలు సెంట్రల్ సిటీ డెయిర్ అల్-బలాలోని అల్-అక్సా అమరవీరుల ఆసుపత్రికి చేరుకున్నారు. డెయిర్ అల్-బలాహ్ తూర్పు భాగంలో, అల్-బురిజ్, అల్-మఘాజీ శిబిరాల్లో.. సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని నుస్రాత్ శిబిరానికి ఉత్తరాన పాలస్తీనా ప్రతిఘటన గ్రూపులు, ఇజ్రాయెల్ దళాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి.
కాల్పుల విరమణ ప్రతిపాదన ఉన్నప్పటికీ దాడులు
తక్షణ కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం చేసినప్పటికీ, అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత గాజాపై ఇజ్రాయెల్ తన దాడిని కొనసాగిస్తూనే ఉంది. అప్పటి నుండి గాజాలో 36,800 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు కలిపి సుమారు 83,700 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ యుద్ధంలో ఎనిమిది నెలలు, ఆహారం, స్వచ్ఛమైన నీరు, ఔషధాల కొరత కారణంగా గాజా విస్తారమైన ప్రాంతాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.
Read Also:Group-1 Prelims: నేడే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. కేంద్రాల వద్ద 144 సెక్షన్..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..