AP Census: ఏపీలో జనాభా లెక్కల సేకరణకు డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Census: జనాభా లెక్కల సేకరణ-2027పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ గత జనాభా లెక్కల సేకరణ 2011లో జరిగిందని తదుపరి జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది ఫిబ్రవరి 9నుంచి 28 వరకూ జరగనుందని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్ తెలిపారు.రానున్న జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని తెలిపారు. మొదటి దశ హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్(హెచ్ఎల్ఓ), రెండవ దశ పాపులేషన్ ఎన్యుమరేషన్ (పిఇ) జరుగుతుందని వెల్లడించారు. దేశంలో జనాభా లెక్కల సేకరణ నేపధ్యాన్ని వివరిస్తూ 2027లో నిర్వహించే జనాభా లెక్కల సేకరణ 16వది కాగా స్వాతంత్ర్యానంతరం నిర్వహించే 8వ జనాభా లెక్కల సేకరణ ఉంటుందని తెలిపారు. ఈసారి నిర్వహించే జనాభా లెక్కల సేకరణ ప్రత్యేకతల గురించి వివరిస్తూ పోర్టల్స్, యాప్స్ ద్వారా నిర్వహించే డిజిటల్ సెన్సస్ అని డిజిటల్ సెన్సస్ అనగా డేటా సేకరణ, నిర్వహణ, మానిటరింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే సెల్ఫ్ ఎన్యుమరేషన్, కుల గణన, జియో రిఫరెన్సు మ్యాపులు, కృత్రిమ మేధను ఉపయోగించి వేగవంతంగా డేటా డెస్సిమినేషన్ వంటి చర్యలు తీసుకుంటారని వివరించారు. డిజిటల్ సెన్సస్ కు సంబంధించి మొబైల్ యాప్స్, వెబ్ పోర్టళ్ళను 16 ప్రాంతీయ భాషల్లో రూపొందించండం జరుగుతోందని వివరించారు. అనంతరం జనాభా లెక్కల సేకరణ-2027 టైం లైన్ గురించి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గత జూన్ 16న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. ఈనెలలో ప్రిన్సిపల్ సెన్సస్ అధికారుల సమావేశం, ఫిబ్రవరి-ఏప్రిల్ మాసాల మధ్య మాస్టర్ ట్రైనర్లు, ఫీల్డు ట్రైనర్లు, సూపర్ వైజర్లు, ఎన్యుమరేటర్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
READ MORE: మరింత అందుబాటులో కొత్త Hyundai i20.. రూ.5.99 లక్షల ప్రారంభ ధరతో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్!
Also Read
- Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
- CJP: భారత్ మరో బంగ్లాదేశ్ కావాలనుకుంటున్నారా.? సీజేపీ అభిజిత్ దీప్కే డిమాండ్ ఏంటి..
- INDIA Bloc: 30న ఇండియా కూటమి కీలక భేటీ.. ‘సర్’పై భవిష్యత్ కార్యాచరణపై చర్చ
- Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
ఈఏడాది ఎప్రిల్ నుంచి సెప్టెంబరు మాసాల మధ్య హౌస్ లిస్టింగ్ కు సంబంధించిన ఫీల్డు వర్కు నిర్వహించ బడుతుందని దానికి 15 రోజుల ముందు సెల్ప్ ఎన్యుమరేషన్ కు అవకాశం ఇవ్వనున్నట్లు రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్ చెప్పారు. “నవంబరు-డిశంబరు మాసాల్లో జనాభా లెక్కల సేకరణకు అవసరమైన మెటీరియల్ ప్రచురణ జిల్లాలకు పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది. డిసెంబరు నెలలో సెన్సస్ అధికారులకు శిక్షణా కార్యక్రమం ఉంటుందని వివరించారు. అదే విధంగా డిసెంబరు నుంచి వచ్చే ఏడాది జనవరి మాసాల మధ్య మాస్టర్ ట్రైనర్లు, ఫీల్డు టైనర్లు, సూపర్ వైజర్లు, ఎన్యుమరేటర్ల నియమాక ప్రక్రియ జరుగుతుందన్నారు. డిసెంబరులో స్పెషల్ చార్జి అధికారుల నియామకం వారికి శిక్షణా కార్యక్రమం ఉంటుందని వివరించారు. అనంతరం రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించిన శాఖలు ఏర్పాట్లు చేయాలి.” అని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్ వివరించారు.
తాజావార్తలు
-
Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
-
Chiranjeevi – Odela Movie: ‘కాకా’ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
-
CJP: భారత్ మరో బంగ్లాదేశ్ కావాలనుకుంటున్నారా.? సీజేపీ అభిజిత్ దీప్కే డిమాండ్ ఏంటి..
-
INDIA Bloc: 30న ఇండియా కూటమి కీలక భేటీ.. ‘సర్’పై భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?