Site icon NTV Telugu

Mallu Ravi : కాంగ్రెస్ నేత మల్లు రవికి నోటీసులు

Mallu Ravi

Mallu Ravi

అభ్యంతరకర పోస్టుల వ్యవహారంలో ఇటీవల సైబర్‌ క్రైం పోలీసులు కాంగ్రెస్ పార్టీ వ్యహకర్త సునీల్ కనుగోలుకు 41 ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ కేసులో కాంగ్రెస్ నేత మల్లు రవికి సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇచ్చారు పోలీసులు. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుకు ఇటీవల నోటీసులు ఇచ్చిన తర్వాత మల్లు స్పందిస్తూ.. ‘నోటీసులు ఇస్తే నాకు ఇవ్వాలి.. కానీ, సునీల్‌కి ఇవ్వడం ఏంటి..? ఆయనకేం సంబంధం’ అని ప్రశ్నించారు. తాజాగా.. మల్లు రవికి నోటీసులు ఇచ్చిన సీసీఎస్ పోలీసులు.. ఈ నెల 12న విచారణకు రావాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే.. వార్‌రూమ్‌కి తానే ఇంచార్జ్‌ అని కాంగ్రెస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యా్ఖ్యలు చేశారు.

Also Read: Ashok Gajapathi Raju: వెనుకబడిన వర్గాలకు, మహిళలకు.. టీడీపీ అవకాశాలిచ్చింది

ఈ నేపథ్యంలోనే సైబర్‌ క్రైం పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. అయితే.. ఈ కేసులో తెలంగాణ కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌ కేసులో భాగంగా సోమవారం 2గంటల పాటు సునీల్‌ కనుగోలును పోలీసులు విచారించారు. అతని స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. తెలంగాణ గళం పేరుతో ఫేస్‌బుక్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత పై దుష్ప్రచారం చేస్తున్నారనే అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌పై పోలీసులు దాడి చేసి కంప్యూటర్లు ఇతరత్రా వస్తువులను స్వాధీనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సునీల్ కనుగోలు సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. సునీల్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడంతో ఆయన తెలంగాణ హైకోర్టును గత నెలలోనే ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. సీసీఎస్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది హైకోర్టు.

Exit mobile version