Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ నిందితురాలిగా చేర్చింది. కవితను నిందితురాలిగా పరిగణిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. గతంలో సమాచారం కోసం కవితను సీబీఐ ప్రశ్నించింది. దర్యాప్తు తర్వాత కవితను నిందితురాలిగా సీబీఐ పేర్కొంది. 41-C కింద నోటీసులు ఇచ్చామని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఇప్పటికే కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ కేసులో నిందితుల స్టేట్‌మెంట్స్ ఆధారంగా కవితకు నోటీసులు జారీ చేసింది సీబీఐ. 2022 డిసెంబర్‌లో కవితను సీబీఐ ప్రశ్నించింది. ఇప్పటివరకు ఆమెను నిందితురాలిగా చేర్చుకుండానే కవితను ఈడీ మూడు సార్లు విచారించింది. తాజా నోటీసుల నేపథ్యంలో ఆమె విచారణకు హాజరవుతారా? లేదా కోర్టును ఆశ్రయిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Read Also: CM Revanth Reddy: వనదేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్.. ఆ రోజే 2 హామీలు ప్రారంభిస్తామని ప్రకటన