Site icon NTV Telugu

Delhi: ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై కర్రలు, రాడ్లతో దాడి..

Delhi

Delhi

10 మంది వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై కర్రలు, రాడ్లతో దాడి చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున న్యూ అశోక్ నగర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన మామే తమపై దాడి చేశారని బాధితురాలు కాజల్ ఆరోపిస్తుంది. ఆస్తి తగాదా విషయంలో దాడికి పాల్పడినట్లు చెబుతుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు.

Read Also: Paris Olympics: మాజీ క్రికెటర్ కుమారుడికి ఒలింపిక్స్ లో రెండు స్వర్ణాలు..

కాగా.. ఈ దాడిలో గాయపడిన వారిలో కాజల్, తండ్రి విమల్ అగర్వాల్, తల్లి సునీత, సోదరుడు అభిషేక్, 17 ఏళ్ల సోదరి.. 11 ఏళ్ల సోదరుడు ఉన్నారు. విమల్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మామ రామ్‌విలాస్‌తో కుటుంబానికి ఆస్తి తగాదాలు ఉన్నాయని అభిషేక్ పోలీసులకు చెప్పాడు. ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది.. అయితే మార్చిలో తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చిందని బాధితులు చెబుతున్నారు. ఈ క్రమంలో.. అప్పటి నుంచి తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. మార్చి 9న తమపై దాడి చేశాడని.. ఆగస్టు 4న నోయిడాలో తన తండ్రిపై దాడికి పాల్పడ్డారని అభిషేక్ చెప్పాడు. తాజాగా.. మరోసారి పది మంది తమ ఇంట్లోకి వచ్చి దాడి చేశారని చెబుతున్నారు.

Read Also: AP Police: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే పోలీస్ శాఖలో కొలువుల భర్తీ!

కాగా.. ఈ దాడికి సంబంధించిన ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. కాజల్ తెలిపిన సమాచారం ప్రకారం.. ఆమె మేనమామ రాంవిలాస్, అతని కుమారులు చిత్రాంశు, ప్రియాంషు, బేతు.. మరికొందరు తమ కుటుంబంపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు.. నిందితుల కోసం వెతుకుతున్నారు.

 

Exit mobile version