Bandi Sanjay Kumar: దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతోపాటు కుల గణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సాహసోపేత నిర్ణయం తీసుకున్న ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగబోతోందని, అత్యంత శాస్త్రీయంగా కేంద్రం నిర్వహించే ఈ సర్వేలో కులాల వారీగా ఎంత జనాభా ఉందో నిక్కచ్చిగా తెలుతుందని.. తద్వారా ఏ కులానికి నష్టం వాటిల్లకుండా రిజర్వేషన్ల అమలులో న్యాయం జరిగే అవకాశముందని వివరించారు.
Read Also: CSK vs PBKS: చెపాక్‌లో సీఎస్కే ఈసారైనా…? టాస్ గెలిచి బౌలింగ్ చేయనున్న పంజాబ్
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ విజయమంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటని అన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ కుల గణనకు వ్యతిరేకి. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఏనాడూ దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించకపోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. జనగణన సమయంలో కూడా కులాన్ని చేర్చలేదుని.. కులగణన చేపట్టాలంటూ 2010లో దేశవ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తే ఈ అంశంపై మంత్రుల బృందాన్ని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. కానీ, కుల గణనకు బదులుగా సర్వే మాత్రమే నిర్వహించాలని నిర్ణయించిందే తప్ప శాస్త్రీయ పద్దతిలో కులగణన నిర్వహించనే లేదు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కులగణన అంశాన్ని కాంగ్రెస్ లెవనెత్తుతుందే తప్ప ఆ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అన్నారు. మోడీ సర్కార్ నిర్ణయం కాంగ్రెస్ ఘనతే అయితే డూప్లికేట్ గాంధీల ఏలుబడిలో కులగణన ఎందుకు చేయలేదో సమాధానం రాహుల్ గాంధీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.
Read Also: Meerut: భర్త “గడ్డం” తీయనందుకు, మరిదితో లేచిపోయిన మహిళ..
తెలంగాణసహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన ఈ కులగణన సర్వేలో పారదర్శకత లేనేలేదని అన్నారు. రాజకీయ లబ్ది కోసమే సర్వేలు నిర్వహిస్తూ తమకు అనుకూలమైన కులాల జనాభా పెంచుతూ, ఇతర కులాల జనాభాను తగ్గించే చూపే ప్రయత్నం చేశాయని.. తద్వారా సమాజంలో కులాల మధ్య కుమ్మలాటలు, అస్థిర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రాబోయే జనాభా లెక్కింపులో కుల గణనను చేర్చాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. కేంద్ర నిర్ణయాన్ని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, కుల సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు స్వాగతిస్తూ సహకరించాలని విజ్ఝప్తి చేస్తున్నట్లు తెలిపారు.
