Site icon NTV Telugu

DK Shivakumar: కాంగ్రెస్‌కు ఓట్లేస్తేనే నీళ్లు.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

Dk

Dk

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ వివాదంలో ఇరుక్కున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తన తమ్ముడిని గెలిపిస్తేనే నీరు సరఫరా చేస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తన సోదరుడు సురేశ్ తరఫున ప్రచారంలో భాగంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో డీకే.శివకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: Asaduddin Owaisi: ఒవైసీ వ్యాఖ్యలపై మండి పడ్డ నిర్మలా సీతారామన్‌.. అసలేమన్నాడంటే?

ఎన్నికల సభ ఎన్నికల్లో డీకే సురేశ్‌ బెంగళూరు రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవల తన సోదరుడి తరఫున ఈ ప్రాంతంలో డీకే.శివకుమార్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓ హౌసింగ్‌ సొసైటీలో ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అయ్యింది. తాను ఇక్కడికి ఓ బిజినెస్‌ డీల్‌ కోసం వచ్చానని.. తన సోదరుడు సురేశ్‌ను గెలిపిస్తే.. మూడు నెలల్లో మీ ప్రధాన సమస్యను పరిష్కరిస్తానన్నారు. కావేరీ నదీ జలాలు సరఫరా చేసి మీకు అవసరమైన నీటిని కూడా కేటాయిస్తానని డీకే.శివకుమార్ చెప్పినట్లు చెప్పినట్లుగా వీడియోలో ఉంది.

ఇది కూడా చదవండి: Gaddam Prasad: నా తల్లిదండ్రులు, భార్య, పిల్లల మీద ఓట్టేసి చెబుతున్నా.. రంజిత్ అన్న గెలుపు కోసం కృషి చేస్తా

ఈ వీడియోను రాష్ట్ర బీజేపీ నేతలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, తన సోదరుడి కోసం ఓట్లు దోపిడీ చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. డీకే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు ధ్రువీకరించింది. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినందుకు గానూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు.

గత కొద్ది రోజులుగా బెంగళూరు వాటర్ సమస్యతో అల్లాడుతుంది. కనీస అవసరాలకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొందామా? అన్న దొరకని పరిస్థితులు. పైగా నీళ్ల ధరలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో డీకే.శివకుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ అంశాన్ని లేవనెత్తిట్టుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Vasuki Indicus: టైటానోబోవా కన్నా పెద్ద పాము ఈ “వాసుకి”.. కచ్‌లో బయటపడిన అతిపెద్ద పాము శిలాజాలు..

Exit mobile version