మనం ఏదైనా కారును కొననుగోలు చేసిన తర్వాత దాన్ని డెలివరీ చేస్తున్నప్పుడు.. డీలర్‌షిప్‌లు పెద్ద నకిలీ కీతో వినియోగదారలకు ఫొటోలు దిగేందుకు ఇస్తుంటారు ఎందుకో తెలుసా.. కొంత మంది వ్యక్తులు కొత్త కారు కొన్నప్పుడు, వారు కారు ముందు నిలబడి పెద్ద కీ పట్టుకుని దిగిన ఫోటోలను తీసుకుని..వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతుంది.
Read Also: Garba events: గర్బా వేడుకల్లో విషాదం.. గుండెపోటుతో 24 గంటల్లో 10 మంది మృతి
అయితే, అన్నింటిలో ఫస్ట్ ది, ఇలా చేయడం వల్ల కస్టమర్‌లు కొత్త కారు కొనడానికి మరింత ఆసక్తి చూపస్తారు. దానిని సెలబ్రేట్ చేసుకోవాలని డిలర్ షిప్ ఇలా చేస్తుంది. ఇందుకోసమే పెద్ద కీతో కస్టమర్లు ఫొటోలు దిగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొత్త కారు కొనడం అంటే భారీగా పెట్టుబడి పెట్టడం.. ఈ అనుభవాన్ని గుర్తుండిపోయేలా చేయడానికి కస్టమర్లు ఇష్టపడతారు. కాబట్టి, కస్టమర్ వారి కొత్త కారు గురించి ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూపించడానికే ఈ పెద్ద కీతో ఉన్న ఫొటోలను అందిస్తుంటారు.
Read Also: Kajal Aggarwal: కాజల్ కు అంత అన్యాయం చేస్తావా.. అనిల్ బ్రో.. ?
ఇక, ఈ పెద్ద కీ కార్ యొక్క కంపెనీ బ్రాండింగ్‌ను తెలియజేస్తుంది. పెద్ద కీలో కార్ కంపెనీ లోగో మనకు కనిపిస్తుంది. వినియోగదారులు ఈ ఫోటోను సురక్షితంగా తమ దగ్గర దాచి పెట్టుకుంటారు. దాంతో పాటు కార్ కంపెనీ లోగో ఎల్లప్పుడూ వారి దగ్గర ఉంటుంది. ప్రజలు తమ కారు కొనుగోళ్ల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు.. ఇలాంటి పరిస్థితిలో, కంపెనీ లోగోను పెద్ద కీపై ఉంచడం వల్ల వారికి ఉచిత ప్రమోషన్ కూడా దొరుకుతుంది.