Site icon NTV Telugu

car caught fire: నడుస్తున్న కారులో మంటలు.. చూస్తుండగానే

Mqdefault

Mqdefault

car caught fire: రంగారెడ్డి జిల్లా గండిపేట ఎంజీఐటీ కళాశాల వద్ద నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు మొత్తానికి మంటలు అంటుకున్నాయి. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడటంతో.. దట్టమైన పొగలు ఆ ప్రాంతమంతా అలుముకున్నాయి. ఇంజిన్‌లో నుంచి వస్తున్న పొగలను గమనించిన కారు డ్రైవర్.. వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేయడంతో కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Read Also: Frog Curry : కప్పకూర తిన్న కుటుంబం.. కక్కుకుని చనిపోయిన బాలిక

వెంటనే నార్సింగీ పోలీసులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు ఫైర్ ఇంజిన్‌ సాయంతో మంటలను అదుపులో తీసుకొచ్చారు. ఫైర్ ఇంజిన్ ఘటనా స్థలానికి వచ్చే సమయానికి కారు మొత్తం బూడిదైంది. అయితే.. డ్రైవర్ అప్రమత్తతే వారిని పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది.

Read Also: Bhatti Vikramarka: నేనూ పాదయాత్ర చేస్తా.. త్వరలోనే షెడ్యూల్ చెబుతా

ఇదిలా ఉంటే నగరంలోని గండిపేట కు సమీపంలో సోమవారం రాత్రి కారు చెరువులోకి దూసుకెళ్లింది. అతి వేగంగా కారు చెరువులోకి దూసుకెళ్లడంతో కారులో ప్రయాణీస్తున్న ముగ్గురు గాయపడ్డారు. గాయడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు చెప్పారు.

Exit mobile version