NTV Telugu Site icon

Harthik Pandya: ఆఫ్ఘాన్ తో వన్డే సిరీస్ కు కెప్టెన్ హార్థిక్ పాండ్యా..

Hardik Pandya

Hardik Pandya

డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా.. స్వదేశంలో ఆఫ్ఘానిస్తాన్ తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. కాగా.. బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సిరీస్ జరుగుతుందా లేదా అనేది అనుమానంగా మారింది. కానీ బీసీసీఐ మాత్రం ఈ సిరీస్ ను నిర్వహించాలని మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆఫ్ఘాన్ తో వన్డే సిరీస్ కు భారత జట్టును ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ సిరీస్ కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : Aamir Khan: మళ్లీ వైరల్ అవుతున్న ఆమిర్ పెళ్లి వార్త… ఆ ఒక్క వీడియోనే కారణం

ఆఫ్ఘానిస్తాన్ తో ఆడేందుకు భారత జూనియర్ జట్టును సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఈ సిరీస్ లో భారత కెప్టెన్సీ పగ్గాలు ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఐపీఎల్ -2023లో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు కూడా తెలుస్తోంది. ఆఫ్గాన్‌ సిరీస్‌కు జైశ్వాల్‌ సెలక్టర్లు ఎంపిక చేసే ఛాన్స్‌ ఉంది అని క్రికెట్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి.

Also Read : Customer: అప్పు ఇవ్వని షాప్‌ యజమాని.. కర్రతో దాడి చేసిన కస్టమర్‌

అదే విధంగా చెన్నై సూపర్ కింగ్స్ తరపున దుమ్మురేపుతున్న ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ను కూడా సెలక్టర్లు పిలుపునివ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక ఆఫ్గానిస్తాన్ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇంకా వెల్లడించలేదు. ఈ సిరీస్‌ జాన్‌ లో జరిగే అవకాశం ఉంది. ఈ సిరీస్‌ ముగిసిన అనంతరం భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది.

Show comments