Death Penalty: సౌదీ అరేబియాలో గత కొద్దీ కాలంగా కాలక్రమేణా కొత్త ముప్పు వేగంగా పెరుగుతోంది. అదే ‘క్యాప్టగాన్’ (Captagon) ముప్పు. క్యాప్టగాన్ అనేది ఒక డ్రగ్. 2025లో ఇప్పటివరకు సౌదీలో 217 మందికి ఉరిశిక్ష అమలు చేయగా.. అందులో 144 మందికి ఈ మందు వల్లే ఉరిశిక్ష పడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే..
క్యాప్టగాన్ అనేది ఒక ఎమ్ఫెటమిన్ తరహా మత్తు మందు. దీన్ని “పేదల కోకైన్” అని కూడా పిలుస్తారు. ఇది మానసిక ఉల్లాసాన్ని కలిగించే మత్తు మందుగా బాగా ప్రేవు గాంచింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో అలాగే సౌదీలో ఉన్న ధనిక యువతలో దీన్ని తీసుకోవడం బాగా అలవాటుగా మారింది. ముఖ్యంగా చాలామంది యువత దీనికి బానిసలైపోయారు. దీనివల్ల, ఆ మందును సరఫరా చేసే వారిని మాత్రం నేరుగా ఉరిశిక్షతో శిక్షిస్తున్నారు.
ICC Rankings: మనల్ని ఎవర్రా ఆపేది.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ లేపిన టీమిండియా స్టార్స్..!
ఈ డ్రగ్స్ సరఫరాలో మిస్ర్ (ఈజిప్ట్), పాకిస్తాన్, ఇతియోపియా, సిరియా వంటి దేశాల వలసదారులే అధికంగా పాల్గొంటున్నవారు. ఒక్క జూన్ నెలలోనే డ్రగ్స్ కేసుల్లో 37 మందికి ఉరిశిక్ష విధించగా.. అందులో 34 మంది విదేశీ పౌరులే. ఇది అంతర్జాతీయంగా తీవ్రమైన విమర్శలకు దారితీసినా.. సౌదీ అధికారులు తాము తీసుకుంటున్న కఠిన నిర్ణయాల వెనక్కి మాత్రం తగ్గడం లేదు. ఈ ముందుకు ఇదివరకు ప్రధాన కేంద్రంగా సిరియా ఉండేది. 2023 నాటికి ప్రపంచ క్యాప్టగాన్ ఉత్పత్తిలో మెజారిటీ శాతం సిరియా నుంచే వచ్చేది. సిరియా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో డ్రగ్ వ్యాపారమే వారి ప్రధాన ఆదాయ మార్గంగా మారింది. అయితే అక్కడ బషర్ అల్ అసద్ సర్కారు కూలిన తర్వాత 2024 డిసెంబరులో ఏర్పడిన ప్రభుత్వం ఈ డ్రగ్ తయారీ కర్మాగారాలన్నీ మూసేశామని జూన్ లో ప్రకటించినా.. ఇప్పుడు కూడా సౌదీలో ఈ డ్రగ్ లభ్యమవుతూనే ఉంది.
Panneerselvam: ఎన్డీఏకు గుడ్‌బై చెప్పిన పన్నీర్ సెల్వం.. స్టాలిన్‌ను కలిసిన తర్వాత ప్రకటన
క్యాప్టగాన్ డ్రగ్ సౌదీ సమాజానికి ప్రాణాంతకంగా భావిస్తున్నట్లు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ తెలిపారు. ఇది సౌదీ నైతిక మౌలికతల్ని ధ్వంసం చేస్తుందని.. అందుకే, కఠినంగా ఎదుర్కోవాల్సిన విషయం ఇది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఫిర్యాదు చేస్తున్నా.. మరోవైపు డ్రగ్ సరఫరాదారులపై ఉరిశిక్ష అమలు చేయడాన్ని కొనసాగిస్తున్నారు సౌదీ అధికారులు.