CAPF Bill: ఢిల్లీలో నేతలు బిజిబిజీ.. నేడు రాజ్యసభలో “కేంద్ర సాయుధ పోలీసు బలగాలు” (CAPF) బిల్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CAPF Bill: దేశ రాజధాని న్యూఢిల్లీలో నేడు రాజకీయంగా అనేక కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఒకవైపు రాజ్యసభలో “కేంద్ర సాయుధ పోలీసు బలగాలు” (CAPF)కు సంబంధించిన కీలక బిల్లు ప్రవేశపెట్టబడుతుండగా, మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.
DhurandharTheRevenge : ధురంధర్ 2 లో బిగ్ మిస్టేక్.. దర్శకుడిపై నెటిజన్స్ ట్రోలింగ్
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు రాజ్యసభలో “సాయుధ పోలీసు బలగాల సాధారణ పరిపాలన బిల్లు-2026” (CAPF)ను ప్రవేశపెట్టనున్నారు. దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ బిల్లు ద్వారా కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (Central Reserve Police Force (CRPF)), సరిహద్దు భద్రతా దళం (Border Security Force (BSF)), కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (Central Industrial Security Force (CISF)), ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీస్ దళం (Indo-Tibetan Border Police (ITBP)), సశస్త్ర సీమా బలగం Sashastra Seema Bal (SSB) వంటి ఐదు ప్రధాన కేంద్ర సాయుధ బలగాలను ఒకే చట్ట పరిధిలోకి తీసుకురానున్నారు.
ఈ దళాల సంబంధించి నియామకాలు, సర్వీస్ నిబంధనలు, ఉన్నత స్థాయి పదవుల నిర్వహణ వంటి అంశాలను ఒకే చట్రంలోకి తీసుకురావడం ఈ బిల్లులో ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పటివరకు అనధికారికంగా అమలవుతున్న విధానాన్ని చట్టబద్ధం చేయాలనే ప్రయత్నంగా దీనిని భావిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నత స్థాయి పోస్టుల్లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారుల నియామకానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే.. డైరెక్టర్ జనరల్ (DG) పోస్టులు పూర్తిగా IPS అధికారులకే కేటాయింపు జరుగుతుంది. ఇంకా ఇన్స్పెక్టర్ జనరల్ (IG) స్థాయి పోస్టుల్లో 50% IPS అధికారులకు, అలాగే అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ADG) స్థాయిలో కనీసం 67% IPS అధికారుల నియామకం జరగనుంది. ఇటీవల డెప్యుటేషన్ విధానంపై వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, ఈ విధానాన్ని చట్టబద్ధం చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ముఖ్య ఆర్థిక అంశాలు చర్చకు రానున్నాయి. ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టనుంది. రేపు ముఖ్యమంత్రి రేఖ గుప్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి “గ్రీన్ బడ్జెట్” ఉండొచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఢిల్లీలో కాలుష్య నియంత్రణపై ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పథకాలు, నగర అభివృద్ధి చర్యలు ప్రధానంగా ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్‌ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!